పవన్‌ను ఇమిటేట్ చేస్తున్న సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబు సినిమా ఫ్యామిలీ నుండి రాలేదు, అతని మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, హీరోలో ఉండాల్సిన క్వాలిటీ ఒక్కటీ అతనిలో లేదు, కానీ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. చివరికి టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దృష్టిని కూడా ఆకర్షించాడు. అంతే కాదు 'సంపుర్నేష్ బాబు రాష్ట్ర యువత' కూడా ఏర్పాటయింది.
ఈ సినిమా కాన్సెప్టు విషయానికిస్తే.....చెత్త ఫిల్మ్ మేకింగ్ అంటే ఎలా ఉంటుంది అనే కోణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారని తెలుస్తోంది. సినిమా ప్రచారం కోసం ట్రైలర్ రూపంలో 'నేనే సంపూ ... ముద్దు పేరే తెగింపు' అనే సాంగ్‌ని కూడా వదిలాడు సంపూ. ట్రైలర్ మాత్రం నెటిజనులను ఒక రేంజ్ లో ఉర్రూతలూగించింది.
తన సినిమాకు ప్రచారం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కూడా వాడుకుంటున్నాడు ఈ బాబు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రూపొందించిన పవనిజం లోగోను.....అనుసరిస్తూ తన పేరుతో ఓ లోగోను ఇంటర్నెట్లోకి వదిలాడు. తన పాట్లేదో తను పడక.....ఈ చర్యతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను అనవసరంగా కెలిగాడు. మరి వారి రియాక్షన్ ఎలా ఉంటోందో?


Click it and Unblock the Notifications











