సాహోతో పోటీ పడుతున్న కొబ్బరిమట్ట.. వినడానికి వింతగా ఉన్నా నిజమే.. మీరే చూడండి

టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ సాహో సినిమాతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా కొబ్బరిమట్ట పోటీ పడుతోంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమాతో సంపూర్ణేష్ బాబు లాంటి చిన్న హీరో సినిమా పోటీ పడటమేంటి? అని ఆశ్చర్యపోతున్నాడు కదూ! చూడండి మీకే తెలుస్తుంది.

సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట

సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట. సాయి రాజేష్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. చివరకు ఈ రోజు (శనివారం) ‘కొబ్బరిమట్ట' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

భారీ అంచనాల నడుమ ప్రభాస్ సాహో

భారీ అంచనాల నడుమ ప్రభాస్ సాహో

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది 'సాహో' సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.

 ట్రైలర్ రిలీజ్.. సాహోకి, కొబ్బరిమట్టకు ముడి

ట్రైలర్ రిలీజ్.. సాహోకి, కొబ్బరిమట్టకు ముడి

బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో వస్తున్న మరో భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. దేశవ్యాప్తంగా అందరి చూపు సాహో పైనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సినిమా యూనిట్ నేడు (శనివారం) సాహో ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. దీంతో సరిగ్గా ఇక్కడే సాహోకి, కొబ్బరిమట్టకు ముడిపడింది.

సాహోతో పోటీ పడుతూ కొబ్బరిమట్ట

సాహోతో పోటీ పడుతూ కొబ్బరిమట్ట

సాహో ట్రైలర్ రిలీజ్ కోసం సోషల్ మీడియాలో ఎంతలా వెతుకుతున్నారో, కొబ్బరిమట్ట సినిమా ఎలా ఉందనే విషయంపై కూడా అంతే రేంజ్ లో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ రూపంలో సాహోతో పోటీ పడుతూ కొబ్బరిమట్ట ట్విట్టర్ ట్రెండింగ్ లిస్ట్‌లో చేరిపోయింది. ప్రస్తుతం సాహో ట్రైలర్ డే హాష్ ట్యాగ్ రెండో స్థానంలో ట్రెండ్ అవుతుండగా, కొబ్బరిమట్ట హాష్ ట్యాగ్ మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది. అదన్నమాట సంగతి.

కొబ్బరిమట్ట జోష్..

కొబ్బరిమట్ట జోష్..

ఇక మరోవైపు ఈ రోజే (శనివారం) విడుదలైన కొబ్బరిమట్ట సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడి ప్రతిభకు, సంపూర్ణేష్ బాబు పెర్ఫార్మెన్స్ కి ఫిదా అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ వారంలో మిగితా సినిమాలతో పోలిస్తే కొబ్బరిమట్ట జోష్ ఎక్కువగా కనిపించే అవకాశముందని అంటున్నారు విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X