సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ ఫస్ట్‌లుక్ (ఫోటో)
హైదరాబాద్: ఈ రోజు 'హృదయ కాలేయం' అనే చిత్రమైన టైటిల్‌తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కామెడీ హీరో బర్నింగ్ స్టార్.....మరో విచిత్రమైన టైటిల్‌లో మరో సినిమాకు రెడీ అయ్యాడు. ఆ సినిమా పేరు 'కొబ్బరి మట్ట'. 'ది లీవ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మ్యాన్' అనేది సబ్ టైటిల్.
తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు. ఇందులో సంపూర్ణేష్ బాబు పెదరాయుడు చిత్రంలో మోహన్ బాబు గెటప్‌ను పోలి ఉండటం గమనార్హం. దీంతో ఈచిత్రం మోహన్ బాబు పెదరాయుడు చిత్రానికి స్పూఫ్‌లా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే 'కొబ్బరి మట్ట' చిత్రంలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో కనిపించబోతుననాడు. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రలు పోషించబోతున్నాడట. తన తొలి సినిమా విడుదల కాకముందే రెండో సినిమాను ప్రకటించిన సంపూర్ణేష్ బాబు భవితవ్యం ఏమిటో....ఈ రోజు విడుదలైన 'హృదయ కాలేయం' సినిమాను బట్టి తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











