బండ బూతులు తిట్టారు.. ఆ టైమ్‌లో రాజమౌళి ట్వీట్.. సంపూర్ణేష్ బాబు
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కెరీర్‌లో మూడో సినిమాగా వస్తోంది 'కొబ్బరి మట్ట' మూవీ. కథ - స్క్రీన్ ప్లే - మాటలను స్టీవెన్ శంకర్ అందించిన ఈ సినిమాకి రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు సంపూర్ణేష్ బాబు. ఈ సందర్బంగా కాసేపు మీడియాతో ముచ్చిటించిన సంపూ.. తన కెరీర్ లోని పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.
తన మొదటి సినిమా 'హృదయ కాలేయం' తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఆ సమయంలో తనపై దాడులు కూడా జరిగాయని చెప్పాడు. 'హృదయ కాలేయం' పోస్టర్ విడుదలైనప్పటి నుంచే జనాలు నన్ను బండ బూతులు తిట్టడం ప్రారంభించారని అన్నాడు. ఇక ఆ సినిమా విడుదలైన తర్వాత కొందరైతే ఫోన్లు చేసి మరీ తిట్టారని చెప్పాడు. నిజంగా సినిమా తీయాలంటే ఇంత అనుభవించాలా? అనుకున్నానని, చాలా బాధ పడ్డానని అన్నాడు. అయితే ఎప్పుడైతే రాజమౌళి గారు 'హృదయ కాలేయం' గురించి ట్వీట్ చేశారో.. అప్పటి నుంచి క్రమంగా తనపై విమర్శలు ఆగిపోయాయని సంపూర్ణేష్ బాబు పేర్కొన్నాడు.

ఆయన తాజా సినిమా 'కొబ్బరి మట్ట'లో సింగల్ టేక్‌లో చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఈ డైలాగ్ సరికొత్త రికార్డు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డైలాగ్ చెప్పే విషయంలో తనకు సాయి రాజేష్ సహకారం ఎక్కువగా ఉందని సంపూ చెప్పాడు. 'కొబ్బరి మట్ట' విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నానని ఆయన అన్నాడు.


Click it and Unblock the Notifications











