బ్రెయిన్ తో చూడొద్దు ( ‘సింగం123’ ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : "ఈ సినిమాను బ్రెయిన్‌తో చూడకూడదు. కేవలం తెరమీద బొమ్మను చూసి నవ్వుకోవాలంతే" అంటూ నిర్మాత ఇస్తున్న గమనికతో వస్తున్న చిత్రం ఇది. 'హృదయకాలేయం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా కామెడీని రుచి చూపించిన... హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు. ఇప్పుడు ఆయన మరోసారి స్ఫూఫ్ లతో నవ్వించటానికి మన ముందుకు వస్తున్నాడు.'హృదయకాలేయం' తర్వాత పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించినా... అతను హీరోగా నటించిన సెకండ్ ఫిల్మ్ 'సింగం 123'నే. తొలి చిత్రం మాదిరే ఇందులోనూ సంపూ తనదైన శైలిలో నటించి... ఆడియెన్స్ కు వినోదాల విందును అందించబోతున్నాడని నిర్మాతలు చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ మోస్ట్ అవెయిటింగ్ మూవీలో పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఓ విలేజ్ లో కథ జరుగుతుంది. అక్కడ మాఫియా డాన్ లింగం ఉంటాడు. అతను ఆ విలేజ్ లో లా అండ్ ఆర్డర్ ని డిస్ట్రబ్ చేస్తూంటాడు. అతన్ని అరెస్టు చేయటానికి గతంలో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ప్రయత్నించి ఉంటారు. విఫలమవుతారు. ఇప్పుడు అక్కడకి సింగం 123 (సంపూర్ణేష్ బాబు) వస్తాడు. తన దైన శైలిలో ...దుర్మార్గుల ఆట కట్టించటానికి అతను చేసే సాహసాలు, చెప్పే డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. హిట్టైన చాలా పోలీస్ సినిమాలను గుర్తు చేస్తూ ఈ సినిమా సాగుతుంది.

Sampoornesh Babu's Singam 123 preview

నిర్మాత విష్ణు మాట్లాడుతూ ‘‘ పూర్తిస్థాయి వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో సంపూర్ణేశ్‌బాబు నటన హైలైట్‌గా నిలుస్తుంది. డైమండ్‌ రత్నం అందించిన సంభాషణలు సినిమాకు ప్లస్‌ అవుతాయి. పాటలకు చక్కని స్పందన వస్తోంది. స్ఫూఫ్‌ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను కామెడీ యాంగిల్‌లోనే చూడాలి'' అని అన్నారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ ''విష్ణు.. 'సంపూతో ఓ సినిమా చేస్తా' అన్నప్పుడు నేను వారించాను. 'అదేదో నువ్వే నటించొచ్చు కదా..' అన్నా. కానీ నన్ను ఏదోలా ఒప్పించాడు. ఈ సినిమా చూశాను. సంపూని తెరపై చూశాక అతనిలో ఇంత మంచి నటుడున్నాడా అనిపించింది. కొన్నిచోట్ల నన్ను కాపీకొట్టాడు. సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా. ఎవ్వరినీ కించపరచాలని తీసింది కాదు. '' అన్నారు.

''విష్ణు, మోహన్‌బాబు అందించిన సహకారంతోనే అనుకొన్నది అనుకొన్నట్టు తెరపై చూపించగలిగా'' అన్నారు దర్శకుడు. ఇంత మంచి సంస్థలో పనిచేయడం సంతృప్తినిచ్చిందని సంపూ తెలిపాడు.

అలాగే ఇదే రోజు ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లోనూ విడుదల చేస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ‘పే పర్ వ్యూ' పద్ధతిలో ప్రేక్షకులు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి ఈ చిత్రాన్ని చూడవచ్చు. ఈ రకంగా విష్ణు ‘సింగం 123'ని ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నాడు. మొదటిసారి సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో సరికొత్త ప్రయోగం చేస్తున్నామని మంచు విష్ణు తెలిపారు.

బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ

నటీనటులు:సంపూర్ణేష్‌ బాబు, సనమ్‌,అన్నపూర్ణ, వేణుగోపాలరావు, వైవా హర్ష తదితరులు
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల,
ఎడిటర్: యం.ఆర్.వర్మ,
మ్యూజిక్: శేషు,
డైలాగ్స్: డైమండ్ రత్నం,
ఆర్ట్: రఘు కులకర్ణి,
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత: విష్ణు మంచు,
సమర్పణ డా.మోహన్ బాబు
దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.
విడుదల తేదీ: 05, జూన్, 2015.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X