twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంపూ కొత్త చిత్రం 'సింగం 123' ఫస్ట్ లుక్ (ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ :'హృదయకాలేయం' చిత్రంతో పరిచయమైన సంపూర్ణేష్ బాబు తన తొలి చిత్రంతోనే అందిరనీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సినిమాలతో బిజీ అయిన సంపూతో మంచు ఫ్యామిలీ ఓ చిత్రం చేయటానికి ముందుకు వచ్చింది. ఈ చిత్రం టైటిల్ 'సింగం 123'.

    అక్షత్‌ శర్మ దర్శకత్వంవహిస్తున్న ఈ చిత్రానికి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంపూ ఇందులో ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రచార చిత్రం విడుదలైంది.

    హృదయకాలేయం చిత్రాన్ని మించిన కామెడీ, సెంటిమెంట్, లవ్ అండ్ ఎఫెక్షన్ సింగం 123 చిత్రంలో ఉంటాయని చెప్తున్నారు. ఈ మేరకు ఈ చిత్రంలో సంపూ ఎలా ఉండబోతున్నాడో చెప్పేందుకు కానూ...నిర్మాతలు ఓ ప్రచార చిత్రం విడుదల చేసారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

    Sampoornesh babu Singam 123 First Look Poster

    ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు...కొబ్బరి మట్ట అనే చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే...సంపూర్ణేష్ బాబు హీరోగా... వైరస్ డాట్ కామ్ అనే పేరుతో ఓ వినూత్న చిత్రం తెరకెక్కుతోంది. (బి వేర్) అనేది ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రానికి సీ.హెచ్. శివరామకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎన్ ఫిల్మ్స్ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది.

    కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

    English summary
    Vishnu Manchu’s 24Frames Factory next in the row is Singham 123 with Sampoornesh Babu (Sampoo).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X