»   » పవన్ కళ్యాణ్ మీద కామెంట్: గట్టిగా బుద్ది చెప్పిన సంపూ!

పవన్ కళ్యాణ్ మీద కామెంట్: గట్టిగా బుద్ది చెప్పిన సంపూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఓ జోకర్, కార్టూన్ అంటూ.... బాలీవుడ్‌కి చెందిన కమాల్ రషీద్ ఖాన్ చేసిన కామెంట్స్ తో పవర్ స్టార్స్ ఫ్యాన్స్ రక్తం మరిగిపోతోంది. ఇప్పటికే అతడి ట్విట్టర్ కూతలపై ఫ్యాన్స్ ఓ రేంజిలో విరుచుకు పడ్డారు. తాజాగా టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా కమాల్ రషీద్‌ ఖాన్‌ను తగిన సమాధానం ఇచ్చాడు.

సంపూర్ణేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.... 'అవును...అతను(పవన్) కార్డూనే.... బ్యాట్‌మెన్ మాదిరి. నైస్ మీటింగ్ యూ స్నూపీ' అంటూ ట్వీట్ చేసారు. సాధారణంగా కుక్కలను మనం స్నూపీ అనే పేరుతో పిలుస్తుంటా. కమాల్ రషీద్ ఖాన్‌ను కుక్కను పిలిచినట్లు ఆ పేరుతో సంపూర్ణేష్ బాబు పిలవడం ద్వారా తగిన బుద్ది చెప్పారని అంటున్నారు ఫ్యాన్స్.

Also Read: పవన్ కళ్యాణ్ ఓ జోకర్.... 'సర్దార్'చూడను!

సంపూర్ణేష్ బాబు సినిమాల విషయానికొస్తే..
'హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలతో తూసుకెలుతున్న సంపూర్ణేష్ బాబు బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకులపై దాడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం.

పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అనే మూడు డిఫరెంట్ పాత్రల్లో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే పెదరాయుడు, పాపారాయుడు పాత్రలకు సంబంధించిన లుక్ రిలీజ్ చేయగా.... తాజాగా ఆండ్రాయుడు పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసారు. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్‌, గుడ్‌ సినిమా గ్రూప్‌, సంజన మూవీస్‌ పతాకంపై ఆది కుంభగిరి, సాయి రాజేష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Sampoornesh Babu's strong reaction on Kaamal R Khan Comments on Pawan Kalyan. "Yes...He is a Cartoon... Like Batman... Nice meeting you snoopy" Sampoornesh Babu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu