వేణుపై దాడి: స్పందించిన సంపూర్ణేష్ బాబు
హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షోలో ప్రదర్శించిన ఓ స్కిట్ విషయంలో నటుడు వేణుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తమ కులస్తుల మనోభావాలు దెబ్బతినేలా స్కిట్ చేసారంటూ గౌడ కమ్యూనిటీ వారు ఈ దాడి జరిగింది. వేణుపై భౌతిక దాడి చేయడంపై హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు స్పందించారు.
ఈ విషయమై ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ‘మా తోటి నటుడు జబర్దస్త్ వేణుపై దాడిని ఖండిస్తున్నాను. మనోభావాలు దెబ్బతింటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మనుషులుగా మా అభిప్రాయాలు వేరు కావొచ్చు.... నటులకి మాత్రమే కులం, మతం అనే భేదాలు అంటగట్టడం సరికాదు. దాడిని ఖండిస్తున్నాను' అన్నారు.

వేణుపై జరిగిన దాడిని మెగా బ్రదర్ నాగ బాబు కూడా ఖండించారు. వేణుపై గౌడ కమ్యూనిటీకి చెందిన వారు చేసిన దాడిని తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరం(టిటిడిఎఫ్) ఖండించింది. ఈ మేరకు టిటిడిఎఫ్ అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు.
మరో వైపు నటుడు వేణును అరెస్టు చేయాలంటూ గౌడసంఘాల నాయకులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని గౌడ సంఘాల నేతలు ఆరోపించారు.


Click it and Unblock the Notifications











