హృదయ కాలేయం : బర్నింగ్ స్టార్ రికార్డ్

హైదరాబాద్ : విచిత్రంగా 'ఎ కిడ్నీ విత్ హార్ట్' అనే సబ్ టైటిల్‌తో 'హృదయ కాలేయం' చిత్రం హీరో సంపూర్ణేష్ బాబు తనదైన రీతిలో సినిమాకు ప్రచారం కల్పిస్తూ...తొలి సినిమాతోనే ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా యూట్యూబ్‌లో రికార్డు కూడా నెలకొల్పాడు.
సంపూర్ణేష్ బాబు సినిమా ఫ్యామిలీ నుండి రాలేదు, అతని మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, హీరోలో ఉండాల్సిన క్వాలిటీ ఒక్కటీ అతనిలో లేదు, కానీ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రేక్షకుల దృష్టినే కాదు....టాలీవుడ్ ప్రముఖుల దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
తాజాగా విడుదలైన 'హృదయ కాలేయం' మూవీ సెంకడ్ ట్రైలర్ రికార్డు స్థాయిలో యూట్యూబ్‌లో హిట్స్ సొంతం చేసుకుంది. కేవలం 4 రోజుల్లోనే 5 లక్షల హిట్స్ వచ్చాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్, ప్రత్యేకలు లేకుండా తెరంగ్రేటంతోనే ఇంత రెస్పాన్స్ తెచ్చుకోవడం ఆశ్చర్యమే మరి.
ఈ సినిమా కాన్సెప్టు విషయానికిస్తే.....చెత్త ఫిల్మ్ మేకింగ్ అంటే ఎలా ఉంటుంది అనే కోణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారని తెలుస్తోంది. సినిమా ప్రచారం కోసం ట్రైలర్ రూపంలో 'నేనే సంపూ ... ముద్దు పేరే తెగింపు' అనే సాంగ్‌ని కూడా వదిలాడు సంపూ. రెండో ట్రైలర్లో చెప్పి డైలాగులు నెటిజనులను ఒక రేంజ్ లో ఉర్రూతలూగించింది.


Click it and Unblock the Notifications











