»   » "డాన్ ఘంటశాల" గా సంపూర్ణేష్ బాబు

"డాన్ ఘంటశాల" గా సంపూర్ణేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా ..బందిపోటు చిత్రంలో అల్లరి నరేష్ తో సమానంగా నవ్వించిన సంపూర్ణేష్ బాబు మరోసారి తన సత్తా చూపించటానికి సిద్దమవుతున్నారు. ఈ సారి "డాన్ ఘంటశాల" గా ఆయన కనిపించనున్నారు. వేర్ ఈజ్ విద్యాబాలన్ అనే చిత్రంలో ఆయన కామెడీ విలన్ పాత్ర పోషిస్తున్నారని సమాచారం. సెకండాఫ్ లో సంపూర్ణేష్ బాబు కనిపించి, నవ్విస్తాడంటున్నారు. ఈ పాత్ర బాగా క్లిక్ అవుతుందని దర్శక,నిర్మాతలు బాగ నమ్మకం పెట్టుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రిన్స్‌, జ్యోతిసేథీ జంటగా శ్రీభ్రమరాంబ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌'. ఎల్‌.వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మినరసింహరెడ్డి, ఎ.చిరంజీవి నిర్మాతలు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘ఈ కథ నాకు తెలుసు. సరైన సమయంలో ప్రిన్స్‌కి మంచి సినిమా కుదిరింది. క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనరిది. నేటి ట్రెండ్‌కి బాగా నచ్చుతుంది'' అని అన్నారు.

Sampoornesh turns Don Ghantasala

దర్శకుడు మాట్లాడుతూ ‘‘సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రిన్స్‌ తన గత చిత్రాల్లో కన్నా అందంగా కనిపిస్తాడు. సినిమా కోసం చాలా వర్కవుట్స్‌ చేశాడు'' అని అన్నారు. ‘‘క్యాచీ టైటిల్‌ కుదిరింది. కామెడీ, రొమాన్స్‌, థ్రిల్‌ అన్ని ఉన్న చిత్రమిది'' అని హీరో ప్రిన్స్‌ చెప్పారు. ‘‘ఫస్ట్‌ కాపీ రెడీ అయింది. వచ్చే వారంలో పాటల్ని, అతి త్వరలో సినిమాను విడుదల చేస్తాం'' అని నిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రంలో ప్రిన్స్‌, జ్యోతి సేథీ, జెన్నీఫర్‌, సంపూర్ణేష్‌బాబు, జయ ప్రకాష్‌రెడ్డి, రావు రమేష్‌, ఆశిష్‌ విద్యార్థి, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, మధునందన్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా: చిట్టిబాబు, సంగీతం: కామ్రాన్‌, ఎడిటింగ్‌: మధు, పాటలు: కాసర్ల శ్యామ్‌, వరికుప్పల యాదగిరి, ఫైట్స్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అక్కినేని శ్రీనివాసరావు, బాలాజీ శ్రీను, కోప్రొడ్యూసర్‌: హేమ వెంకట్‌, నిర్మాతలు: ఎల్‌.వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి, ఎ.చిరంజీవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌.

English summary
In the forthcoming movie “Where Is Vidya Balan” Sampoornesh is playing a key role. He plays the role of a comedy villain named Don Ghantasala and will spin the whole of second half with his hilarious acts.
Please Wait while comments are loading...