హీరో అవతారమెత్తుతున్న తెలుగు దర్శకుడు!!

By Staff

Samudra
డైరక్టర్ సముద్ర కు మొదటనుంచీ హీరో కావాలన్న ఆశ ఉందని పరిశ్రమలో చాలా మంది చెప్తూంటారు. ఆ మధ్య ఆయన ప్రియమణి కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన 'పరుత్తి వీరన్' ని తెలుగులోకి రీమేక్ చేస్తూ హిరోగా తెరంగ్రేటం చేద్దామని ప్లాన్ చేసారు. దాని నిమిత్తం ఫొటో సెషన్ కూడా నిర్వహించిన ఆయన ఎందుకనో విరమించుకున్నారు. ఆ కోరిక తీర్చుకోవటానికి కళ్యాణ్ రామ్ హీరోగా తన దర్శకత్వంలో వచ్చిన 'విజయదశమి'లో గెస్ట్ రోల్ చేసాడు. అయితే ఆ సినిమా బోల్తా కొట్టింది.

ఈలోగా ఇరాన్ సినిమా 'బరాన్' కి ఫ్రీమేక్ గా వస్తున్న 'మల్లెపూవు'లో పాత్ర చేస్తాడని చెప్పుకున్నారు. అయితే అది విరమించుకుని పూర్తి స్ధాయి దర్శకత్వంపైనే మనుస్సు పెట్టాడు. ఇక ఇప్పుడు పూర్తి స్ధాయి హీరోగా సైకిల్ అనే సినిమా చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాడని సమాచారం. ఇంకా ఈ సినిమాలో శివాజీ, మీరాజాస్మిన్,స్నేహ కూడా చేయనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే అధికారికంగా ఈ న్యూస్ బయిటకు వస్తుంది. అంటే త్వరలో సముద్ర మనకు తనలోని నటనా సముద్రుడుని బయిటకు తీయనున్నారన్నమాట ...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X