హృదయాన్ని టచ్ చేసే కార్మేని సెల్వం.. సముద్రఖని, గౌతమ్ వాసుదేవన్ కాంబినేషన్‌లో..
దక్షిణాది సినిమా పరిశ్రమలో కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మండమైన ఆదరణ లభిస్తున్నది. అలాంటి చిత్రాలు చిన్నవా? భారీ బడ్జెట్ సినిమాలా? అనే విషయాన్ని పట్టించుకోకుండా ఆడియెన్స్ భారీ విజయాన్ని అందిస్తున్నారు. ఇటీవల కాలంలో మలయాళం, తమిళం, తెలుగులో కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా భారీగా వసూళ్లను సాధిస్తున్నాయి. అలాంటి కోవలోనే వస్తున్న తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రం కార్మేని సెల్వం. ఈ సినిమా కథ ఏమిటి? ఈ చిత్రంలో నటించిన వారెవరు? అనే వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలో ప్రముఖ దర్శకులు, నటులు సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించిన ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. అరుణ్ రంగరాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్నది.

కార్మేని సెల్వం సినిమా కథ విషయానికి వస్తే.. నిజాయితీతో జీవించే ఒక సాధారణ కారు డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగాడు అనే అంశాన్ని ఎమోషనల్‌గా తెరకెక్కించారు. సగటు మనిషి ఈ కథ, నిజాయితీ, జీవన పోరాటం నేపథ్యంగా హై డ్రామా రూపొందింది.
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందిన ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు రెడీ అయింది. ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా మొదలుపెట్టి.. సినిమాను ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చిత్ర యూనిట్, దర్శకుడు రామ్ చక్రి తెలిపారు.
నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు
బ్యానర్: పాత్‌వే ప్రొడక్షన్స్
నిర్మాత: అరుణ్ రంగరాజులు
కథ, దర్శకత్వం: రామ్ చక్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీ శరవణన్
మ్యూజిక్: MAAS
సినిమాటోగ్రఫి: యువరాజ్ దక్షన్
ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్
ప్రొడక్షన్ డిజైనర్: శంకర్
లిరిక్స్: మణి అముతవన్, ఉమా దేవి
ఆడియోగ్రఫి: రాఘవ్ రమేష్
సౌండ్ డిజైన్: రాఘవ్ రమేష్ - హరి ప్రసాద్ MA
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: మణి దామోతథరన్
ప్రొడక్షన్ మేనేజర్: వీఆర్ రాంభరత్
మార్కెటింగ్: నాని కాంచనపల్లి - జయరాజ్ గేదెల


Click it and Unblock the Notifications











