కళ్యాణ్ రామ్ హీరోయిన్ కిడ్నాప్ కేస్, విచారణ
ముంబయి : ఒక అమ్మాయి అపహరణ యత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి సనా ఖాన్. కళ్యాణ్ రామ్ సరసన కత్తి చిత్రంలో చేసిన ఆమె ముందుస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా నావేద్ జినా (26), క్షితిజ్ దూబే (20), మిస్మిత్ ఆమ్రే (20) ఇంజినీరింగ్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉన్నందున బెయిల్‌పై విడుదలయ్యారు. వచ్చేనెల 6న తిరిగి అరెస్టు చేయనున్నారు.
సనా సోదరుడు నావేద్ ఇంటర్నెట్‌లో ఒక అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తన సోదరి సనా ఖాన్‌తో కలవాలని కోరడంతో సాన్‌పాడా రెసిడెన్సీలోని డామీనోజ్ పిజ్జా హోటల్ వద్ద ఏప్రిల్ 30న సాయంత్రం 5.30 గంటలకు కలుసుకుంది.
నావేద్‌ను పెళ్లి చేసుకోవాలని సనా బెదిరించినా ఆ అమ్మాయి నిరాకరించడంతో ఆమెను ఎత్తుకెళ్లడానికి యత్నించారు. అమె ఇంటికెళ్లి తల్లిదండ్రులను బెదిరించారు. సనా ఖాన్ 'మెంటల్' చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది.


Click it and Unblock the Notifications












