For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీళ్లే ఆ...మెంటల్ హీరోయిన్స్

    By Bojja Kumar
    |

    ముంబై : మెగాస్టార్ చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రానికి రీమేక్‌గా సల్మాన్ హీరోగా బాలీవుడ్‌లో 'మెంటల్' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.

    తాజాగా బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో హీరోయిన్లుగా సనాఖాన్, డైసీ షా ఎంపికయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ల పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఈ నేపథ్యంలో అగ్రస్థాయి హీరోయిన్లు కాక పోయినప్పటికీ ఈ ఇద్దరినీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా ఈ ఇద్దరు ముద్దుగుమ్మల సుడి తిరుగుతుందో చూడాలి.

    'మెంటల్' చిత్రాన్ని ఈ సంవత్సరం రాబోయే ఈద్‌ పండుగకు విడుదల చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్‌ సమాచారం. ఈ పండుగ సందర్భంగా విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ చిత్రాలు బాక్సాఫీసును బద్ధలుకొట్టాయి. ఈద్‌ పండుగకు వచ్చిన చిత్రాల్లో 2009వ సంవత్సరంలో వచ్చిన 'వాంటెడ్‌', 2010లో విడుదలైన దబంగ్‌, 2011లో బాడీగార్డ్‌తో పాటు ఈ సంవత్సరం ప్రేక్షకులను అలరించిన 'ఏక్‌ థా టైగర్‌'లు భారీ విజయం సాధించాయి.

    అందుకే ఈ సారి ఈద్‌కు 'మెంటల్' చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే చిత్రం కావడంతో తనకు మంచి పేరు వస్తుందని సల్మాన్ భావిస్తున్నారట. ఇప్పటికే బీయింగ్‌ హ్యూమన్‌ సంస్ధ ద్వారా పలు రకాల సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న సల్మాన్‌ ఈ సినిమా తర్వాత మరింత గొప్పపేరు తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.

    English summary
    Salman Khan's upcoming Mental will see two Mumbai girls Sana Khan and Daisy Shah both known names in the south, debut as the leading girls. In late 2012 director Sohail Khan announced his intention to remake the film Stalin.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X