కళ్యాణ్ రామ్ ఆమెను కాపాడలేదు..నాగార్జున అయినా సేవ్ చేస్తారా?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
కళ్యాణరామ్ సరసన కత్తి చిత్రంలో హీరోయిన్ గా చేసిన సనాఖాన్ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ చిత్రంతో తెలుగుకు పరిచయమైన ఆమె సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవటంతో నిరుత్సాహపడుతోంది. అయితే ఆమె తెలుగులో మరో చిత్రం చేసింది. అది మరేదో కాదు నాగార్జున కమెండోగా చేసిన గగనం చిత్రం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె ప్లైట్ లో ప్రయాణించే ప్రయాణికురాలుగా చేసింది. ప్లైట్ టెర్రరిస్టుల చేత హైజాక్ కాపడితే కమెండో నాగార్జున ప్రయాణికులను ఎట్లా సేవ్ చేసాడన్నది కథ. ఇక ఈ విషయమై సనాఖాన్ మాట్లాడుతూ..కత్తి చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేక పోయింది. అయితే మంచి హిట్ అవుతుందని వినిపిస్తోంది. ఇక నాగార్జున తో చేసిన గగనం చిత్రం నాకు లిప్ట్ ఇస్తుందని భావిస్తున్నాను. అందులో నాది గుర్తుండిపోయే పాత్ర. భావోద్వేగాలు భిన్నంగా ఉంటాయి. నాగార్జునకీ, నాకు మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయి. ఆయన తను పెద్ద హీరోఅన్నట్లు ఎప్పుడూ బిహేవ్ చెయ్యకుండా బాగా సహకరించారు అంది.
Story first published: Thursday, November 18, 2010, 12:12 [IST]