twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిల్క్ స్మితగా మంచు మనోజ్ హీరోయిన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : కళ్యాణ్ రామ్ సరసన కత్తి చిత్రంలో చేసిన సనా ఖాన్ గుర్తుందా..పోనీ... మంచు మనోజ్ సరసన మిస్టర్ నోకియా చిత్రంలో కనిపించిన హీరోయిన్ గుర్తుందా. ఆ సనా ఖాన్ త్వరలో సిల్క్ స్మితగా కనిపించనుంది. మళయాళంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం టైటిల్ క్లైమాక్స్. ఈ చిత్రాన్ని తమిళ్,తెలుగు భాషల్లో డబ్ చేస్తారు.

    ఇక ఈ సిల్మ్ స్మిత పాత్రతో ఆమె అబినయానికి పేరు వస్తుందని,తన కెరీర్ సెటిల్ అవుతుందని భావిస్తోంది. అందరు హీరోయిన్స్ విద్యాబాలన్ తరహాలో తమ కెరీర్ కు ఈ చిత్రం ఉపయోగపడి మంచి పాత్రలు తర్వాత వస్తాయని భావించి చేస్తున్నానని చెప్తోంది. విద్యా బాలన్ నటించిన 'ది డర్టీ పిక్చర్'కలెక్షన్స్ బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షాక్ అయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తరహాలో తెలుగు,తమిళంలో చిత్రం రూపొందుతోంది.

    సనాఖాన్ ప్రధానపాత్రలో సిల్క్ గా నటించటానికి రెడీ అవుతన్న ఈ చిత్రానికి.... సిల్మ్ స్మితకు మళయాళంలో బ్రేక్ ఇచ్చిన ఆంధోని ఈస్ట్ మ్యాన్ స్క్రిప్టు అందిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి 'ది డర్టీ పిక్చర్'కి అస్సలు సంభందం లేదని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. 'ది డర్టీ పిక్చర్'అనేది ఫిక్షన్ స్టోరీ అని,తాము చేస్తున్నదే ఒరిజనల్ సిల్మ్ స్మిత జీవిత చరిత్ర అని చెప్తున్నారు. మరో ప్రక్క ఇక ఇప్పటికే 'ది డర్టీ పిక్చర్' బెంగాళి వెర్షన్ రెడీ అవుతోంది. రాఖీ సావంత్ ఈ బెంగాళి వెర్షన్ లో నటిస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి శతాబ్ది రాయ్ దర్శకత్వం వహిస్తోంది. శతాబ్ది రాయ్ ..నటి నుంచి పొలిటీషన్ గా ఎదిగి పార్లమెంట్ కి వెళ్లుతున్న దర్శకురాలు.

    అలాగే కన్నడంలో సైతం 'ది డర్టీ పిక్చర్'మరో వెర్షన్ చిత్రం తయారవుతోంది. పాకిస్దాన్ శృంగార నటి వీణా మాలిక్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా పేరు 'డర్టీ పిక్చర్‌.. సిల్క్‌ సకత్‌హాట్‌మగ'. ఈ చిత్రాన్ని రైట్స్ తీసుకోకుండా చేస్తూండటంతో ఏక్తా కపూర్ నోటీసులు పంపింది. ఈ డర్టీ పిక్చర్ రీమేక్ తర్వాత తన కెరీర్ పూర్తిగా మారుతుందని భావిస్తున్నాని రాఖీ సావంత్ అంటోంది. ఇప్పటివరకూ చిన్న చిన్న పాత్రలు,ఐటం సాంగ్ లు చేసుకునే తనకు ఇది పూర్తిగా నటించే అవకాశమిచ్చే సినిమా కాబట్టి నా శాయిశక్తులా కృషి చేస్తానని మాట ఇచ్చింది. తన అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచనని అంది.

    English summary
    Sana Khan will be doing the role of actress Silk Smitha in the forthcoming Malayalam movie titled ‘Climax’. The movie will be dubbed in Tamil as ‘Nadigaiyin Diary’ and also dubbed in Telugu. The movie is not the remake of Vidya Balan’s Dirty Picture. Antony Eastman who introduced Silk Smitha in the Malayalam movies made the script for the film. Sana Khan is well known for her sexy roles in the Telugu and Tamil movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X