For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెచ్చగొట్టేలా సనాఖాన్ సెక్సీ 'క్త్లెమాక్స్‌' (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : సినిమా అంటే రంగుల లోకం.. ఇది సినిమాలు చూసేవారి మాట. అందులో దిగితే గాని అసలు సంగతి తెలియదు. ఇలా సినీ రంగంలో దశాబ్దకాలం పాటు వెలిగిన ఓ సినీ నటి జీవితం ఆధారంగా మలయాళంలో రూపొందిన చిత్రం 'క్త్లెమాక్స్‌'. ఈ సినిమా ఇప్పుడు 'గజ్జలగుర్రం'గా తెలుగులో రాబోతోంది. సనాఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అనిల్‌ దర్శకుడు. నిర్మాత వి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ''ఓ సినీ నటి జీవితం అధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అందరినీ ఆకట్టుకొనేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాము''అన్నారు.

  కళ్యాణ్ రామ్ సరసన కత్తి చిత్రంలో చేసిన సనా ఖాన్ సిల్క్ స్మితగా కనిపించటానికి కమిటైంది. ఆ చిత్రం టైటిల్ క్లైమాక్స్. ఈ చిత్రం మళయాళంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం కోసం తీసిన స్టిల్స్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మసాజ్ సీన్ రసిక హృదయాల్లో ఉత్సాహం రేపుతోంది.

  ఈ చిత్రాన్ని తమిళ్,తెలుగు భాషల్లో డబ్ చేస్తారు. సనాఖాన్ ప్రధానపాత్రలో సిల్క్ గా నటించిన ఈ చిత్రానికి.... సిల్మ్ స్మితకు మళయాళంలో బ్రేక్ ఇచ్చిన ఆంధోని ఈస్ట్ మ్యాన్ స్క్రిప్టు అందిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి 'ది డర్టీ పిక్చర్'కి అస్సలు సంభందం లేదని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. 'ది డర్టీ పిక్చర్'అనేది ఫిక్షన్ స్టోరీ అని,తాము చేస్తున్నదే ఒరిజనల్ సిల్మ్ స్మిత జీవిత చరిత్ర అని చెప్తున్నారు. సురేష్‌ కృష్ణ, సబిన్‌ సన్ని, లక్ష్మి, సంధ్య తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: బెర్నీ, మాటలు: మల్లూరి వెంకట్‌, పాటలు: వెన్నెలకంటి.

  మిగతా స్టోరీ స్లైడ్ షో లో...

  నమ్మకం...

  నమ్మకం...

  తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తగా వచ్చిన తనకు ప్రోత్సాహం బాగా వుందని, మంచి మంచి పాత్రలు ఎన్నుకొని చిత్రాలు చేస్తున్న తనకు తెలుగు ప్రేక్షకుల అభిమానం తెలుసునని నటి సనాఖాన్ చెప్తోంది. అలాగే ఈ గజ్జల గుర్రం చిత్రం కూడా బాగా ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్తోంది.

  నిజ జీవిత పాత్రలో...

  నిజ జీవిత పాత్రలో...

  ఇంటర్మీడియట్ వరకు చదివిన తనకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని, గతంలో నోకియా చిత్రంలో సంప్రదాయమైన అమ్మాయిగా కనిపిస్తూ, విలన్ షేడ్స్‌లో వుండే విధంగా నటించానని, ఇప్పుడు ఈ చిత్రంలో చాలా భిన్నమైన పాత్ర పోషించానని,వాస్తవ జీవితం గుర్తు చేసేలా ఉంటుందని అంటోంది.

  గ్లామర్ ఉన్నా...

  గ్లామర్ ఉన్నా...

  దాదాపుగా చదువుకున్నప్పుడు నలుగురైదుగుర్ని ప్రేమించానని, అది కేవలం ఆకర్షణ అని అర్థమైనట్లు తెలిపారు. ఈ చిత్రంలో సరికొత్త తరహా పాత్ర చేశానని, గ్లామర్, టాలెంట్ వేరువేరు కాదని ఆమె వివరించారు. గ్లామర్ వున్నాగానీ నటన లేకపోతే అది వృధా అవుతుందని, త్వరలో తన చిత్రాల ద్వారా అందరి ఆదరాభిమానాలు పొందుతానని ఆమె వివరించారు.

  మళయాళంలో...

  మళయాళంలో...

  మళయాళంలో వచ్చిన క్లైమాక్స్ అనే చిత్రానకి ఇది డబ్బింగ్ వెర్షన్ . అక్కడ ఆమె అందచందాలు పెట్టుబడిగా ఈ చిత్రం తీసారు. ఓ మోస్తరు విజయం సాధించింది. స్క్రిప్టు పరంగా వీక్ గా ఉన్నా సనాఖాన్ తన అందాల ప్రదర్శనతో లాక్కొంచని చెప్పుకున్నారు.

  సర్దుకుపోవాల్సిందేనా...

  సర్దుకుపోవాల్సిందేనా...

  'ఒక నటికి ఎంత ప్రతిభ ఉన్నా. అవకాశాల కోసం సర్దుకుపోవాల్సిందేనా?' అనే సంభాషణ ఈ 'క్లెమాక్స్‌' చిత్రంలో ఉంది. దాన్ని చెప్పేటప్పుడు చాలా బాధపడ్డా. అలాంటి పరిస్థితి ఉండటం వాస్తవమే. అది వారివారి అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. నాకు ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పింది.

  సిల్క్‌స్మిత పాత్రలో ....

  సిల్క్‌స్మిత పాత్రలో ....


  సిల్క్‌స్మిత పాత్రలో నటించమని పిలిచినప్పుడు చాలా సంతోషంతో ఒప్పుకున్నా. ఆమె అలంకరణ, ఆహార్యం, నడక, హావభావాలు వంటి అంశాలను నిశితంగా గమనించాను. ఆమెలా నటించడం చాలా కష్టమే. సిల్క్‌స్మిత ఆత్మహత్య చేసుకున్నారా? హత్యకు గురయ్యారా? అన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఆమె మృతి తీరని లోటని ఇప్పుడే అర్థమవుతోంది అన్నదామె.

  నిలుదొక్కుకుంటా...

  నిలుదొక్కుకుంటా...

  తమిళంలో 'శిలంబాట్టం' ద్వారా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సనాఖాన్‌. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసినా ఇక్కడ రాణించలేకపోయింది. తాజాగా ఈ చిత్రంతో తానేంటో ప్రూవ్ చేస్తానంటోంది. తన లోని టాలెంట్ ని ఈ సినిమా వెలికితీస్తోందని, విద్యాబాలన్ కి డర్టి పిక్చర్ బ్రేక్ ఇచ్చినట్లు తనకు ఈ చిత్రం తిరిగి నిలదొక్కుకునేలా చేస్తుందని భావిస్తోంది

  సంభందం లేదు...

  సంభందం లేదు...

  సనాఖాన్ ప్రధానపాత్రలో సిల్క్ గా నటించిన ఈ చిత్రానికి.... సిల్మ్ స్మితకు మళయాళంలో బ్రేక్ ఇచ్చిన ఆంధోని ఈస్ట్ మ్యాన్ స్క్రిప్టు అందించారు. అయితే ఈ చిత్రానికి ‘ది డర్టీ పిక్చర్'కి అస్సలు సంభందం లేదని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

  ది డర్టీ పిక్చర్' ఇంకో వెర్షన్ ??

  ది డర్టీ పిక్చర్' ఇంకో వెర్షన్ ??

  ది డర్టీ పిక్చర్'అనేది ఫిక్షన్ స్టోరీ అని,తాము చేస్తున్నదే ఒరిజనల్ సిల్మ్ స్మిత జీవిత చరిత్ర అని చెప్తున్నారు. మరో ప్రక్క ఇక ఇప్పటికే ‘ది డర్టీ పిక్చర్' బెంగాళి వెర్షన్ రెడీ అవుతోంది. రాఖీ సావంత్ ఈ బెంగాళి వెర్షన్ లో నటిస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి శతాబ్ది రాయ్ దర్శకత్వం వహిస్తోంది. శతాబ్ది రాయ్ ..నటి నుంచి పొలిటీషన్ గా ఎదిగి పార్లమెంట్ కి వెళ్లుతున్న దర్శకురాలు.

  కళ్యాణ్ రామ్ సరసన కత్తి చిత్రంలో

  కళ్యాణ్ రామ్ సరసన కత్తి చిత్రంలో

  కళ్యాణ్ రామ్ సరసన కత్తి చిత్రంలో చేసిన సనా ఖా తర్వాత మంచు మనోజ్ సరసన మిస్టర్ నోకియా చిత్రంలో కనిపించింది. అయినా బ్రేక్ రాలేదు. ఆ సనా ఖాన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు త్వరలో సిల్క్ స్మితగా కనిపించనుంది. మళయాళంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం టైటిల్ క్లైమాక్స్. ఈ చిత్రాన్ని తమిళ్,తెలుగు భాషల్లో డబ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం టైటిల్ గజ్జల గుర్రం.

  English summary
  Actress Sana Khan playing the lead role in upcoming film Gajjala Gurram which is a dubbed version of Malayalam film Climax. The film has done well in Malayalam. Gajjala Gurram film story is an excerpt of all real life incidents of a well-known film actress of times. SARC bagged the rights of the dubbed version of the film. Malluri Venkat and Vennelakanti are penning dialogues for telugu version of Gajjala Guram. Anil directed the film while tunes are by Benny. Sabin Sunny, Lakshmi and Suresh Krishna are playing vital roles in Gajjala Gurram film. V Chandra Sekhar is producer of the film. The film is scheduled for august release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X