ఆ నిర్మాతలను తగలబెట్టినా తప్పులేదంటూ...హీరో ఆగ్రహం!
బెంగుళూరు: కన్నడ సినిమా రంగానికి చెందిన హీరో దునియా విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల మే డే సందర్భంగా సినీ రంగ కార్మికులు ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన దునియా విజయ్ మాట్లాడుతూ నిర్మాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
సినిమా రంగంలోని కార్మికులు, మహిళలపై కొందరు నిర్మాతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని కిరోసిన్ పోసి తగలబెట్టినా తప్పులేదు అంటూ దునియా విజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దునియా విజయ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నిర్మాతలు అతనిపై నిషేదం విధించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఆదివారం సమావేశం అయి చర్చించారు.

నిర్మాతల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలోఅతనిపై నిషేదం విధించాలని కళాకారుల సంఘానికి లేఖ రాస్తామని నిర్మాతలు అంటున్నారు. ఒక బాధ్యతగల హీరో స్థాయిలో ఉండి విజయ్ ఇలా మాట్లాడటం సరికాదని నిర్మాతల మండలి అధ్యక్షుడు మునిరత్న అన్నారు.
అయితే నిర్మాత ఇంత సీరియస్‌గా ఉన్నా.....దునియా విజయ్ మాత్రం వారిని, వారి హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. నిర్మాతల బెదిరింపులకు భయపడి అన్యాయాలను సహించే వ్యక్తినికాదు నేను. అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నాపై చర్యలు తీసుకుంటామంటున్నారు. నాపై నిషేధం విధించే శక్తి ఎవరికీ లేదు...కేవలం ప్రజలకు మాత్రమే నాపై నిషేదం విధించే శక్తి ఉంది. నాపై చర్యలు తీసుకుంటామనే వారు నా ముందుకు వచ్చి మాట్లాడితే నేను ఎందుకు అలా మాట్లాడాను అనే దానికి వివరణ ఇస్తాను అన్నారు.


Click it and Unblock the Notifications











