రాజకీయాల్లోకి హాట్ లేడీ
కన్నడ హాట్ నటి పూజా గాంధీ రాజకీయాల వైపు దృష్టి సారించారు. ప్రస్తుతం కర్నాటకలో ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న జెడి(ఎస్)లో ఆమె చేరారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైఎస్వి దత్తా కూడా దృవీకరించారు. అయితే సంక్రాతి తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జేడీ(ఎస్)నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి.కుమార స్వామి నాయకత్వం పట్ల ఆకర్షితురాలైన పూజా తమ పార్టీలో చేరినట్లు ఆయన వెల్లడించారు. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న పూజా...బెంగుళూరులోని రేస్ కోర్స్ రోడ్ లో ఉన్న పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పార్టీలో చేరిక విషయమై చర్చించారు. పూజా గాంధీ కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
ఈ మధ్య చాలా మంది నటీమణులు...దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా సినీ పరిశ్రమలో తమకు డిమాండ్ తగ్గక ముందే రాజకీయాల బాట పడుతున్న సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలో నటి రోజా ఇదే తరహాలో రాజకీయాల బాట పట్టారు. కన్నడలో ఇప్పటికే తారా, శృతి, రమ్య తదితరులు రాజకీయాల బాట పట్టగా, తాజాగా ఆ లిస్టులో పూజా గాంధీ కూడా చేరింది. ఆ మధ్య పూజా గాంధీ దండు పాల్య అనే కన్నడ సినమాలో న్యూడ్ గా నటించడానికి ఒప్పుకుని సంచలనం సృష్టించింది.
పూజా గాంధీ రాక ద్వారా తమ పార్టీ పట్ల యువత ఆకర్షితులవుతుందని పలువురు జేడీ(ఎస్)నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అమ్మడు గ్లామర్ ఓట్లు రాల్చడంలో ఏ మేరకు ఉపయోగ పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











