ఎ.ఆర్.రహమాన్ సంగీతంతో నాగార్జున కుమారుడు నాగచైతన్య లాంచ్ అవుతాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు రహమాన్ ప్లేసులోకి సందీప్ చౌతా వచ్చి చేరాడు.దిల్ రాజు నిర్మాతగా(నాగార్జున కొంత పెడతారనేది ఫిల్మ్ నగర్ వార్త) వ్యవహరించే ఈ చిత్రం ద్వారా వాసు వర్మ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు.అయితే ఎ.ఆర్ .రహమాన్ ని వద్దనటానికి రకరకాల కారణాలు వినపడుతున్నాయి.నాగార్జున వెర్షన్ అయితే రహమాన్ ని తీసుకోవడం ద్వారా చిత్రానికి అనవసరమైన హైప్ క్రియేట్ అవుతుందని దాన్ని నిరోధించటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు. అయితే లోపాయికారిగా వినపడుతున్నదాన్ని బట్టి అయితే రహమాన్ స్ట్రయిట్ గా తెలుగులో చేసిన సినిమాలు ఏవి హిట్ కాకపోవటంతో ఆయన్ని వద్దనుకుంటున్నారని తెలుస్తోంది.