twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'టైగర్‌' రిజల్ట్ తెలియగానే ఏడ్చేశా : సందీప్ కిషన్

    By Srikanya
    |

    హైదరాబాద్ :''సినిమా రిజల్ట్ గురించి తెలియగానే ఏడ్చేశాను. చూసిన ప్రతి ఒక్కరి నుంచీ సినిమా బాగుంది అన్న స్పందనే వస్తోంది. పిల్లలైతే నన్ను 'టైగర్‌ అన్నా..' అని పిలుస్తున్నారు. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమిది'' అంటున్నారు సందీప్‌కిషన్‌. సందీప్ హీరోగా నటించిన చిత్రం 'టైగర్‌'. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాని కలిసి ఇలా స్పందించారు. హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాకి అందరం ప్రేమతో పనిచేశాం.అందుకుతగ్గట్టుగానే ప్రేక్షకుల నుంచి స్పందన రావడం ఆనందంగా ఉంది'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''ఈ సినిమాకి ప్రధాన బలం సందీప్‌కిషన్‌. కథపై నమ్మకంతో తొలినుంచీ అందరికీ కావాల్సినంత ప్రోత్సాహాన్ని అందించాడు''అన్నారు.

    రాహుల్‌ రవీంద్రన్‌, సీరత్‌ కపూర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. వి.ఐ.ఆనంద్‌ దర్శకుడు. ఎన్వీ ప్రసాద్‌, ఠాగూర్‌ మధు సంయుక్తంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు ఛోటా కె.నాయుడు, సప్తగిరి, తాగుబోతు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

    Sandeep Kishan happy with Tiger result

    చిత్రం కథేమిటంటే...

    విష్ణు (రాహుల్ రవీంద్ర), జై అలియాస్ టైగర్(సందీప్ కిషన్) ఇద్దరూ అనాధలు..అలాగే బెస్ట్ ఫ్రెండ్స్. టైగర్ కు ఆర్య-2 లో అల్లు అర్జున్ కి నవదీప్ మీద స్నేహతో కూడిన ప్రేమ ఉన్నట్లు..విపరీతమైన ప్రేమ. కానీ విష్ణు మాత్రం...అందులో నవదీప్ లాగే...టైగర్ ని..ఓ తలనొప్పిలా ఫీలవుతూంటాడు. ఇలా ఇద్దరూ ఎవరి అభిప్రాయాలతో పెరిగి పెద్దైన తర్వాత...విష్ణు...ఓ సుముహుర్తాన గంగ (సీరత్ కపూర్) తో ప్రేమలో పడతాడు. ఆమె కాశీ కి సంభందించిన అమ్మాయి.

    అక్కడ కులం కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి. తమ కులం అమ్మాయి ...వేరే వారితో ప్రేమలో పడితే పరువు హత్యలు చేసేస్తూంటారు. అందులో భాగంగా.....విష్ణు నికూడా చంపేయటానికి ఎటాక్ చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న టైగర్...తన ఫ్రెండ్ తనని తలనొప్పిగా భావించినా సరే...తనకు ఆప్తమిత్రుడు, ప్రాణం కాబట్టి అతన్ని సేవ్ చేయటానికి కాశీ వస్తాడు. అక్కడ పరువు హత్యలను ఎలా ఎదిరిస్తాడు.. వాళ్లిద్దరినీ ఎలా కలుపుతాడు అనేది మిగతా కథ.

    Sandeep Kishan happy with Tiger result

    చిత్రవిశేషాలను ఎన్వీ ప్రసాద్ చెబుతూ - "ప్రేమ, స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సందీప్ కిషన్ ది ఫుల్ మాస్ మరియు ఎనర్జిటిక్ కారెక్టర్. తమన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంది" అని చెప్పారు.

    ‘ఠాగూర్' మధు మాట్లాడుతూ - "ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. హీరోగా సందీప్ కిషన్ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం అన్నివర్గాల వారూ చూడదగ్గ చిత్రం" అన్నారు.

    తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్. సుప్రీత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: రాము, ఆఫీస్ ఇన్ చార్జ్: భగ్గా రామ్, కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.

    English summary
    Tiger movie success meet Vijayawada. Sundeep Kishan said that he is happy with Tiger result.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X