»   » కృష్ణవంశీది అదో రకమైన టార్చర్.. కానీ తండ్రిలా.. సందీప్ కిషన్

కృష్ణవంశీది అదో రకమైన టార్చర్.. కానీ తండ్రిలా.. సందీప్ కిషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో పక్కింటి కుర్రాడిలా పరిచయమై ఎన్నో విభిన్న పాత్రలతో దక్షిణాదిలో సందీప్ కిషన్ దూసుకెళ్తున్నాడు. ఓ పక్క మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తూనే.. సోలో హీరోగా రాణిస్తున్నారు. ఇటీవల నటించిన తమిళంలో నటించిన మహానగరం సూపర్‌ హిట్‌గా నిలిచింది. నగరం పేరుతో తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రాలు శమంతకమణి, నక్షత్రం చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, జూన్ 14న శమంతకమణి చిత్రం విడుదలవుతున్న సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించారు. శమంతకమణి చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకొన్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..

థియేటర్‌లో పనిచేసే కోటిపల్లి శివగా

థియేటర్‌లో పనిచేసే కోటిపల్లి శివగా

శమంతకమణి చిత్రంలో నేను కోటిపల్లి శివ అనే పాత్రలో నటించాను. ఓ థియేటర్‌ నడిపే కుర్రాడి పాత్ర ఇది. చాలా వినోదాత్మకంగా ఉంటుంది. అయితే థియేటర్ పనిచేసే శివకి ఒక కారుకి మధ్య సంబంధం ఏంటి అనే విషయాన్ని తెరపైనే చూస్తే బాగుంటుంది. ఇది మల్టీస్టారర్‌ సినిమా. ఈ చిత్రంలో నలుగురు హీరోలు అనగానే మళ్లీ మల్టీస్టారర్ చిత్రం చేయకూడదు అనుకున్నాను. కానీ దర్శకుడు శ్రీరాం ఆదిత్య కథ విన్నాక చాలా నచ్చింది. దాంతో మరోమాట ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నాను. ఇది నాకు మాత్రమే కాదు రోహిత్, ఆది, సుధీర్, రాజేంద్రప్రసాద్‌కు గుర్తిండిపోయే చిత్రం అవుతుంది.

రోహిత్, సుధీర్, ఆది దగ్గరయ్యారు

రోహిత్, సుధీర్, ఆది దగ్గరయ్యారు

అయితే ఈ సినిమా తర్వాత మల్టీస్టారర్‌ సినిమాలు తగ్గించాలనుకుంటున్నాను. ఎందుకంటే వరుసగా అవే చేస్తున్న ఫీలింగ్‌ ఉంది. నారా రోహిత్‌, సుధీర్, ఆది నాకు ముందు నుంచే స్నేహితులు. ఈ సినిమాతో వారు నాకు మరింత దగ్గరయ్యారు. నా నటననే కాకుండా నా వ్యక్తిత్వాన్ని కూడా మార్చిన చిత్రం ఇది. ఈ జర్నీ చాలా బాగుంది. సినిమా కోసం చాలా కష్టం పడ్డాను. యాక్షన్‌ సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఈ చిత్రంలో ఎవరి పాత్రలు వారివి. మాకు పాత్ర తక్కువ ఉందని ఎవరు ఫీల్ కావడం లేదు. బేసిక్‌గా కథలో ఎమోషన్ ఉంది. స్క్రీన్ ప్లే బాగా ఉంటుంది.

Shamanthakamani Director's Mass Dance video
 ప్రేమలో విఫలమైన క్యారెక్టర్

ప్రేమలో విఫలమైన క్యారెక్టర్

ఈ చిత్రంలో ప్రేమలో విఫలమైన క్యారెక్టర్ నాది. నా పక్కన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరు అనన్య, మరొకరు జెనీ. జెనీ తెలుగు అమ్మాయి. సోషల్ మీడియాలో డబ్ స్మాష్‌తో పాపులర్ అయింది. ఆమెను శ్రీరాం తీసుకొన్నారు. ఇక అనన్య మిస్ ఆస్ట్రేలియా ఇండియా. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా అనన్య నటించింది.

లుంగీ గెటప్‌కు ఓ ప్రత్యేకత..

లుంగీ గెటప్‌కు ఓ ప్రత్యేకత..

లుంగీ గెటప్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఓ సన్నివేశంలో చాలా డిఫరెంట్‌గా ఉండాలి. ఏదో ప్రత్యేకత ఉండాలి అని ఆలోచించాం. లుంగీ గెటప్ పెట్టాలని నేను, దర్శకుడు శ్రీరాం ఆదిత్య కలిసి నిర్ణయం తీసుకొన్నాం. ఈ గెటప్ బాగా ఉండటంతో ప్రమోషన్‌కు కూడా వాడుకోవాలి అని అనుకొన్నాం. అందుకే ఈ గెటప్‌లో వచ్చాను. ఈ చిత్రంలో పక్కా మాస్ క్యారెక్టర్. రాజేంద్రప్రసాద్‌తో నటించడం చాలా బాగుంది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి. మా ఇద్దరికి బాగా కుదిరింది. రాజేంద్రప్రసాద్‌తో నటించేటప్పుడు ఆయన 200 చిత్రాల్లో నటించారన్న ఫీలింగ్ కనిపించదు.

వరుస చిత్రాల్లో నటిస్తున్నాను..

వరుస చిత్రాల్లో నటిస్తున్నాను..

ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాను. మరో రెండు చిత్రాలు అంగీకరించాను. తమన్నాతో బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ చిత్రంలో, తెలుగులో కృష్ణ కూతురు మంజుల దర్శకత్వంలో నటిస్తున్నాను. గతంలో ఆయన సైఫ్ అలీఖాన్‌, రాణిముఖర్జీలతో హమ్ తుమ్ అనే సినిమా తీశారు. అలాంటి సబ్జెక్ట్ చేయాలనుకొంటున్నాను. అర్బన్ రొమాంటిక్ కథలో నటిస్తావా అని అడిగారు. దాంతో వెంటనే నేను ఒప్పుకొన్నాను.

నరకాసురుడు చిత్రంలో అరవింద్ స్వామితో..

నరకాసురుడు చిత్రంలో అరవింద్ స్వామితో..

ఇంకా ‘శమంతకమణి', ‘నక్షత్రం' కాకుండా సుసీంద్రన్‌ దర్శకత్వంలో ‘సన్నాఫ్‌ సూర్య'లో కూడా నటిస్తున్నాను. తమిళంలో గౌతమ్ మీనన్ నిర్మాతగా నరకాసురుడు చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రానికి డీ 16 సినిమా దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నారు. నరకాసురుడు చిత్రంలో అరవింద్ స్వామి పాత్ర అదిరిపోతుంది. దానికి తగినట్టుగా నేను మౌల్డ్ అవుతున్నాను.

కార్తీక్ కథ చెప్పగానే ఒప్పేసుకొన్నాను..

కార్తీక్ కథ చెప్పగానే ఒప్పేసుకొన్నాను..

నరకాసురుడు చిత్రంలోని నా పాత్రకు ముందుగా నాగచైతన్యను అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల ఎందుకో వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత కార్తీర్ నాకు ఫోన్ చేసి కథ చెప్పాలని ఉంది చెప్పాడు. అప్పుడు నేను గోవాలో ఉన్నాను చెప్పితే ఆయన అక్కడికి వచ్చాడు. కథ చెప్పగానే నేను ఓకే చెప్పాను. దాంతో నరకాసురుడు అవకాశం వచ్చింది.

 కృష్ణవంశీ నా వ్యక్తిత్వాన్ని మార్చివేశాడు..

కృష్ణవంశీ నా వ్యక్తిత్వాన్ని మార్చివేశాడు..

గత ఏడాది కాలంలో నక్షత్రం సినిమా చేశాను. కృష్ణవంశీతో కలిసి పనిచేయడం వల్ల నేను పూర్తిగా మారిపోయాను. నాలో ఉండే చిరాకు, కోపం, జెలసీ ఇలాంటి అంశాలన్నీ నాలో పోయాయి. కృష్ణవంశీతో పనిచేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగింది. నక్షత్రంలో నటించిన తర్వాత నా వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయాను. ఆ తర్వాతనే నాకు పెద్ద డైరెక్టర్లతో పనిచేసే అవకాశం లభించింది. దీనంతటికి క్రెడిట్ కృష్ణవంశీ.

నక్షత్రం నా కెరీర్‌లో మంచి చిత్రం

నక్షత్రం నా కెరీర్‌లో మంచి చిత్రం

నక్షత్రంలో నేను రామారావు పాత్రలో కనిపిస్తాను. నాకు మేకప్ ఉండదు. నేను నల్లగా ఉంటాను. ఇంకా నక్షత్రంలో నల్లగా కనిపిస్తాను. కానీ తెర మీద నా పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తే నేను ఏడాదిపాటు పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది.

కృష్ణవంశీ టార్చర్ పెట్టలేదు..

కృష్ణవంశీ టార్చర్ పెట్టలేదు..

కృష్ణవంశీ నన్ను టార్చర్ పెట్టలేదు. ఆయన స్కూల్ టీచర్ లాంటి వాడు. ఆయన కావాల్సింది రాబట్టుకొంటారు. ఆయన రాబట్టుకొనే విధానం చాలా ఘాటుగా ఉంటుంది. సెట్లో తిట్టేవాడు. ఆయన తిట్టడం వల్ల నేను అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని. ఆ తర్వాత శివాజీరాజా, మరొకరు ఫోన్ చేసి నీవు షూటింగ్‌లో ఇరుగ దీశావని కృష్ణవంశీ చెప్పాడు. బాగా చేశావని మెచ్చుకొన్నాడు అని వారు చెప్పినప్పుడు నాకు ఆయన తండ్రిలా కనిపించాడు. నా తండ్రి కూడా నన్ను కొట్టిన సందర్బాలు ఉన్నాయి. కృష్ణవంశీ వల్ల నా వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయింది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అని సందీప్ కిషన్ చెప్పారు.

English summary
Tollywood hero Sandeep Kishan playing a mass character in Shamantakamani. He is playing as Kotipalli Shiva in this movie. Shamantakamani slated to release on July 14th. In this occassion, Sandeep Kishan speaks with his mind about this movie with media. He shares different experiences about this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu