మహేష్ బాబుతో సంబంధంలేని ‘మహేష్’
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈచిత్రానికి ఆర్. మదన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.కె. పిక్చర్స్ సంస్థ ఈచిత్రాన్ని రూపొందిస్తుండగా దర్శకుడు మారుతి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర హీరో సందీప్ కిషన్ సరసన డింపుల్ చోపడే కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమా గురించి ఎస్.కె. పిక్చర్స్ సంస్థ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ..'ఇది రొమాంటిక్ కామెడీ మూవీ. రొటీన్‌కి భిన్నంగా ఏమాత్రం కొత్తగా ఉన్నా యూత్ ఫుల్ మూవీస్‌కి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఇది సరికొత్త యూత్ ఫుల్ మూవీ. యువతీయువకులు ఎక్కడో ఒకచోట ఈ చిత్రంలోని పాత్రలతో తమని తాము పోల్చుకుంటారు. పెద్దవారికి కూడా తమ పాత రోజులను గుర్తుచేసుకునేలా ఈ సినిమా ఉంటుంది' అన్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: రాణా, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఆర్ మదన్ కుమార్.


Click it and Unblock the Notifications












