సప్తగిరి, సందీప్ కిషన్ రచ్చ (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థలపై సందీప్‌కిషన్‌, సురభి జంటగా రూపొందిన చిత్రం 'బీరువా' . కణ్మణి దర్శకత్వం వహించారు. రామోజీరావు నిర్మాత. తమన్‌ స్వరాలు సమకూర్చారు. శ్రీమణి గీత రచన చేశారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ మంచి ఆసక్తికరంగా ఉంది. లవ్,యాక్షన్, సెంటిమెంట్స్ లతో ఈ 'బీరువా' నిండి ఉందని ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది. ముఖ్యంగా చిత్రంలో సప్తగిరి, సందీప్ కిషన్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ అవుతాయంటున్నారు. ఆ ట్రైలర్ మీరూ చూడండి.

https://www.facebook.com/TeluguFilmibeat

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో హీరోగా తొలి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న సందీప్ కిషన్ రారా..కష్ణయ్య, జోరు చిత్రాల తరువాత ఈ చిత్రాన్ని అంగీకరించారు. సందీప్ కిషన్ హీరోగా ఉషాకిరణ్ ఫిలింస్ ఎల్.ఎల్.పి పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కణ్మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ బీరువా ని రెడీ చేశారు.

Sandeep kishan's 'Beeruva' Trailer

సందీప్‌కిషన్‌, సురభి జంటగా నటిస్తున్న సినిమా ‘బీరువా'. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రామోజీరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కణ్మణి దర్శకుడు. ‘సంజుగాడి ఫ్రెండ్‌' అనేది ఉప శీర్షిక.

మనకేమైనా సమస్యలొస్తే స్నేహితుల్నో, కుటుంబ సభ్యుల్నో సాయం అడుగుతాం. కానీ సంజు మాత్రం బీరువాని అడుగుతాడు. చిన్నప్పట్నుంచీ అతనిది అదే వరస. అతడికి కష్టం ఎదురైన ప్రతీసారీ ఓ ఆపద్బాంధవుడిలా ఆదుకొంటుంది బీరువా. చివరికి తన ప్రేమ విషయంలోనూ అదే జరిగింది. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సందీప్‌కిషన్‌.


దర్శకుడు మాట్లాడుతూ.... ''ప్రతిష్ఠాత్మకమైన రెండు నిర్మాణ సంస్థలు కలిసి చేసిన ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. ఆ అవకాశం ఇచ్చిన రామోజీరావు, జెమినీ కిరణ్‌లకు నా కృతజ్ఞతలు. ఈ కథలో బీరువా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కథానాయకుడికి ఎలాంటి సమస్య ఎదురైనా బీరువా సాయంతో అధిగమిస్తుంటాడు. ఆ సన్నివేశాలు వినోదాన్ని పంచిపెడతాయి. కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన చిత్రమిది. సందీప్‌కిషన్‌ అల్లరి కుర్రాడిగా చక్కటి అభినయం ప్రదర్శించాడు. తన చుట్టూ ఉన్నవాళ్లందరికీ చిక్కులు తెచ్చిపెడుతుంటాడు. తను మాత్రం ఆ చిక్కుల నుంచి తప్పించుకొంటూ ఉంటాడు. సురభి తెరపై అందంగా కనిపిస్తుంది. ప్రతీ సన్నివేశాన్నీ అందంగా చూపించే ప్రయత్నం చేశారు ఛాయాగ్రాహకుడు ఛోటా కె.నాయుడు. ఇది ఇంటిల్లిపాదికీ వినోదాలు పంచే ఓ మంచి సినిమా అవుతుంది'' అన్నారు.

''ప్రతీ ఇంట్లోనూ బీరువా ఉంటుంది. అందులో రకరకాల వస్తువులు దాచుకొంటుంటారు. అయితే తనను తాను బీరువాలో దాచుకొన్న ఓ కుర్రాడి కథే ఈ చిత్రం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఒక ప్రేమజంటకి బీరువా ఎలా సాయపడిందన్నది ఆసక్తికరం.

సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ....'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తర్వాత ఒప్పుకొన్న సినిమా ఇది. నటుడిగా నాకు ఓ కొత్త అనుభవాన్నిచ్చింది. కథ, కథనం... అన్నీ కొత్త తరహాలో సాగుతుంటాయి. కణ్మణి ఈ చిత్రంతో నా నటనకు మరిన్ని మెరుగులు దిద్దారు. మా ఛోటా మావయ్య ప్రతీ సన్నివేశాన్నీ అందంగా చూపించారు. ఆయన సెట్‌లో ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. తమన్‌, గౌతంరాజు లాంటి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేసింది. వెలిగొండ శ్రీనివాస్‌ రాసిన మాటలు త్రివిక్రమ్‌ను గుర్తుకు తెప్పిస్తాయి. 'బీరువా' రూపంలో తప్పకుండా ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ.. ''ఈ సినిమా పేరు గురించి మొదట వి.వి.వినాయక్‌తో చెప్పాను. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌తో పాటు మీరంతా కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'బీరువా'అంటే ఆసక్తికరంగానే ఉంటుందని ప్రోత్సహించారు. ఇప్పుడు నిజంగానే ఆ పేరుపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది'' అన్నారు ఛోటా కె.నాయుడు.

సందీప్ కిషన్, నరేష్‌, ముఖేష్‌ రుషి, అనీషాసింగ్‌, చలపతిరావు, అజయ్‌, సప్తగిరి, వేణు, షకలక శంకర్‌, గుండు సుదర్శన్‌, శివన్నారాయణ, అనితాచౌదరి, సంధ్య తది తరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, మాటలు: వెలిగొండ శ్రీనివాస్‌, పాటలు: శ్రీమణి, పోరాటాలు: వెంకట్‌, నృత్యాలు: రాజుసుందరం, బాబా భాస్కర్‌, శేఖర్‌, కళ: సాహి సురేష్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌:సుబ్రతా చౌదరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X