సందీప్ కిషన్ ‘డీకే బోస్’ స్టోరీ లైన్

దర్శకుడు ఎన్.బోస్ మాటల్లో... 'ఆ పోలీస్‌ఆఫీసర్ డబ్బు కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్ధపడతాడు. తాను పోలీస్‌ఆఫీసర్‌గా గోల్డ్‌మెడల్స్ అందుకోవాలని రాలేదు. గోల్డ్ బిస్కెట్స్ సంపాందించడానికి వచ్చాను అనుకునే తత్వం అతనిది. అలాంటి ఆ యువ పోలీస్ ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు అతనిలో వచ్చిన మార్పేమిటి? అనేది చిత్ర కథ అన్నారు.
నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ' ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ. సందీప్ పాత్ర కొత్తగా వుంటుంది. అచ్చు సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలను ఇటీవలే విడుదల చేశాం. వాటికి చక్కని స్పందన వస్తోంది' అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వెంకట రామరాజు, నజీర్.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డికె బోస్ చిత్రంలో సంపత్ కుమార్, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, అజయ్ కుమార్, మల్లాది, సత్తెన్న, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. అచ్చు సంగీతాన్ని అందించారు. విశ్వేశ్వర్ ఎస్వీ కెమెరాకు పని కల్పించారు. స్క్రిప్టు ఎన్ బోస్ రాసుకున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











