కన్ఫ్యూజన్ కామెడీ ( ‘జోరు’ ప్రివ్యూ)
హైదరాబాద్: ‘‘రెండు గంటలసేపు ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ఈ సినిమా చేశాం. టైటిల్‌కు తగ్గట్లే ‘జోరు' చూపిస్తాను'' అంటూ సందీప్ కిషన్ వస్తున్నారు. వెంకటాద్రి ఎక్సప్రెస్ తో హిట్ రుచి చూసిన సందీప్ కిషన్ దాన్ని కంటిన్యూ చేయాలని చేసిన రారా కృష్ణయ్య భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవటమే కాకుండా...రకరకాల వివాదాలకు దారి తీసింది. దాంతో ఈ చిత్రంతో ఎలాగయినా హిట్ కొట్టాలని సందీప్ కిషన్ చేసారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ...డైరెక్టర్ కుమార్ నాగేంద్రతో ఇది నాకు రెండో చిత్రం. ఇదివరకు ఆయనతో ‘గుండెల్లో గోదారి' చేశాను. అది చేసే టైమ్‌లోనే మళ్లీ కలిసి పనిచేయాలని ఇద్దరమూ అనుకున్నాం. ఆ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. అయితే అందులో వినోదం పాలు తక్కువగా ఉందని ప్రేక్షకులు భావించారు. అందుకని ఈసారి పూర్తి వినోదాత్మక చిత్రం చెయ్యాలని అనుకున్నాం. అలాగే ‘జోరు' చేశాం. కుమార్ చాలా బాగా సినిమాను రూపొందించాడు అన్నారు.

కథ గురించి మాట్లాడుతూ...ఇది చాలా సింపుల్ స్టోరీ. నా పాత్ర పేరు సందీప్. విశేషమేమంటే ఇందులోని ముగ్గురు హీరోయిన్లు ‘అన్నపూర్ణ' అనే ఒకే పాత్ర చెయ్యడం. అలాగే నాకు ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు. అంటే కన్ఫ్యూజన్ కామెడీ అన్నమాట. హీరోయిన్లుగా రాశి ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మ చేశారు. ఆ ముగ్గురితో నాకో మంచి మాస్ సాంగ్ ఉంది. చిరంజీవిగారి పాటల స్ఫూర్తితో ఆ పాటను కంపోజ్ చేశారు. మొదటిసారి బ్రహ్మానందం కాంబినేషన్‌లో నటించా.
మా ఇద్దరి కెమిసీ్ట్ర బాగా కుదిరింది. ఆయన పాత్రపేరు ‘పీకే'. అంటే ‘పెళ్లికొడుకు'. మేం ఎప్పుడు కలిసినా ఆయనా, నేను పౌరాణిక భాషలో మాట్లాడుతుంటాం. ఎలుగుబంటి కామెడీతో సప్తగిరి కూడా బాగా నవ్విస్తాడు. దర్శకుడు రాసుకున్న పాత్రలకు తగ్గ పాత్రధారులు లభించారు. ఇప్పటిదాకా నేను టెన్షన్ పడే పాత్రలు చేశా. మొదటిసారి ఎదుటివాళ్లను టెన్షన్ పెట్టే పాత్రను ఇందులో చేశా.
బ్యానర్: శ్రీ కీర్తి ఫిలింస్
చిత్రం: ‘జోరు'
నటీనటులు: సందీప్‌కిషన్, రాశిఖన్నా, ప్రియాబెనర్జీ, సుష్మ, బ్రహ్మానందం, సప్తగిరి, ప్రియా బెనర్జి, సుష్మారాజ్, బాలయ్య, అజయ్, షాయాజీ షిండే, సత్యం రాజేష్, కాశీ విశ్వనాధ్, హేమ, అన్నపూర్ణమ్మ తదితరులు.
మాటలు: నిరాఖ్,
పాటలు:వనమాలి, భీమ్స్,
ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్,
కెమెరా: ఎం.ఆర్.పళని కుమార్,
సంగీతం: భీమ్స్ సిసిరోలియో,
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర (గుండెల్లో గోదారి ఫేమ్).
నిర్మాతలు: అశోక్, నాగార్జున
విడుదల తేదీ: 07-11-2014.


Click it and Unblock the Notifications











