ఫ్రెండా..ప్రియురాలా తేల్చుకోనున్న సందీప్ కిషన్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్: ఫ్రెండా... ప్రియురాలా ఈ రెండింటి మధ్యన నలిగిపోయే సినిమాలు మనకు తక్కువ వస్తున్నాయి. ముఖ్యంగ ఈ మధ్యకాలంలో ఇలాంటి కథలు రావటం లేదు. ఇప్పుడు అలాంటి కథ రాబోతోందని, స్నేహానికి ప్రాణమిచ్చే పాత్రలో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రం థియోటర్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమో మీరూ చూడండి.

సందీప్‌ కిషన్‌, సీరత్‌కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'టైగర్‌'. రాహుల్‌ రవీంద్రన్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. 'టైగర్‌' చిత్రానికి వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వం వహిస్తుండగా ఠాగూర్‌ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'ఈ చిత్రం కాశీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ కథని.. అదే విధంగా వినోదానికి ప్రాధాన్యం ఉందని చిత్ర దర్శకుడు ఆనంద్‌ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''కాశీ నేపథ్యంలో సాగే కథ ఇది. థ్రిల్‌కు గురిచేసే యాక్షన్‌ సన్నివేశాలతో పాటు వినోదానికీ ప్రాధాన్యముంద''న్నారు. నిర్మాతలు చెబుతూ ''సందీప్‌కిషన్‌లోని హీరోని మరో స్థాయికి తీసుకెళ్లే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకొంటోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ శిష్యుడైన ఆనంద్‌ చిత్రాన్ని చాలా బాగా తీస్తున్నాడు. కాశీ, అలహాబాద్‌, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం. దాదాపుగా సినిమా పూర్తయింది. ''న్నారు.

Sandeep Kishan's “Tiger” Trailer

ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ - "ప్రేమ, స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సందీప్ కిషన్ ది ఫుల్ మాస్ మరియు ఎనర్జిటిక్ కారెక్టర్. ఇందులో ఉన్న నాలుగు పాటలకు తమన్ మంచి స్వరాలందించారు" అని చెప్పారు.

‘ఠాగూర్' మధు మాట్లాడుతూ - "ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. హీరోగా సందీప్ కిషన్ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుంది. అన్నివర్గాలవారూ చూడదగ్గ విధంగా చిత్రం ఉంటుంది. అత్యధిక థియేటర్లలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం" అన్నారు.

ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో సీరత్ కపూర్ హీరోయిన్. గంగ పాత్రలో నటిస్తుంది. సప్తగిరి, సుప్రీత్, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గంగానది నేపథ్యంలో విభిన్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది.

కాశీలో ఈ సినిమా ముఖ్య సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత అబ్బూరి రవి వంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు.

తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్. సుప్రీత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: రాము, ఆఫీస్ ఇన్ చార్జ్: భగ్గా రామ్, కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X