రాజమౌళిని ఇరుకున పెట్టిన అర్జున్ రెడ్డి దర్శకుడు.. అలా చేస్తూ వీడియోలు పెట్టమన్న సందీప్ రెడ్డి
కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వైరస్ ధాటికి ఇప్పటికే ఇరవై లక్షలకు పైగా ఆస్పత్రిపాలయ్యారు. లక్షకు పైగా దుర్మరణం చెందారు. ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్ పంజాకు గజగజ వణికిపోతూ ఉన్నాయి. విరుగుడు లేని ఈ వైరస్ మన దేశంలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే పదిహేను వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. రోజురోజుకూ కరోనా తీవ్రరూపం దాల్చుతోంది.

కరోనా కట్టడికి లాక్ డౌన్..
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పద్దతినే పాటిస్తున్నాయి. మన దేశంలోనూ గత నెల నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది. తాజాగా పొడిగించిన దాని వల్ల మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్ డౌన్ వల్ల ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. మహిళలపై పనిభారం కూడా పెరుగుతోంది.

మహిళలకు చేదోడువాదోడుగా..
లాక్ డౌన్ వల్ల అందరూ ఇంటికి పరిమితమయ్యారు. అందరూ ఇంట్లోనే ఉండటంతో మహిళపై పనిభారం పెరుగుతోంది. పైగా సెలెబ్రిటీల ఇళ్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. పనివారు కూడా ఇప్పుడు లేకపోవడంతో ఎవరి పనులు వారే చేసుకోవాల్సి వస్తోంది.
నిజమైన మనిషి..
ఓ మనిషి ఇంటి పనిని గొప్పగా చేయగలుగుతాడు.. ఒక నిజమైన మగాడు.. పని మనిషి దొరకని ఇలాంటి సమయంలో వారింట్లోని మహిళలను పని చేయనివ్వడు.. ఇంట్లో పని చేసే మహిళలకు సాయం చేయండని ఇంటి పనులను చేస్తూ సందీప్ రెడ్డి వంగా ఓ వీడియోను షేర్ చేశాడు. నిజమైన మనిషిలా ఉండండని.. దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధత్యను రాజమౌళికి అప్పగించాడు.

సరేనన్న దర్శకధీరుడు..
ఈ మేరకు దర్శకధీరుడు రాజమౌళి.. సందీప్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించాడు. మన ఇంట్లో పని చేసే దాన్ని షేర్ చేయడం ఎంతో ముఖ్యం.. రేపు నా వీడియోను పోస్ట్ చేస్తానని ట్వీట్ చేశాడు. ఇక రాజమౌళి చీపురు పట్టి దుమ్ము దులుపుతాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











