తన రికార్డును తానే బద్ధలు చేసుకున్న సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ సినిమాతో ట్రెండ్ సెట్ చేస్తున్నాడుగా?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక హీరోహీరోయిన్లుగా వచ్చిన తాజా చిత్రం యానిమల్. అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ రణ్ బీర్ కపూర్ తండ్రి పాత్రలో ఇరగదీశారు. అలాగే బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించగా... డిసెంబర్ ఒకటో తేదీన ఈ సినిమా విడుదల అయింది.

గత ఐదు రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అర్జున్ రెడ్డి సినిమాను నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాకు చాలా మంది పాజిటివ్ రీవ్యూలు ఇస్తున్నారు. చూసిన వారు చూసినట్లుగా సోషల్ మీడివా వేదికగా స్పిందిస్తూ... సందీప్ రెడ్డి వంగాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే హీరోయిన్ రష్మిక మందన్నాకు వందకు వంద మార్కులు వేస్తూ.. తెగ పొగిడేస్తున్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్టుగా నిలుస్తున్న ఈ సినిమా తాజాగా మరో మూడు రికార్డులను క్రియేట్ చేసింది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sandeep Reddy Vanga Breaks His Own Record With Animal Movie

యానిమల్ సినిమాకు ముందు నుంచి హైప్ క్రియేట్ అవడంతో పెద్ద ఎత్తున బుకింగ్స్ జరిగాయి. తొలి వీకెండ్ అయ్యేసిరేక ఏకంగా 400 కోట్లు రూపాయల వసూళ్లు రాబట్టుకుంది. ఇక 5 రోజుల మొత్తంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.49.10 కోట్లు వసూలు చేసింది. అలాగే తమిళనాడు రూ.5.75 కోట్లు, కర్ణాటక రూ.20.95 కోట్లు, కేరళ రూ.1.70 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.259.25 కోట్లు, ఓవర్సీస్ రూ.143.35 కోట్లు వసూలు చేయగా.. మొత్తం వరల్డ్ వైడ్ గా రూ.480.10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పటికీ దూసుకెళ్తోంది.

ముఖ్యంగా రణ్ బీర్ కపూర్, క్రష్మిక హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఇండియాలో అడల్ట్ రేటెడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ట్రెండ్ సెట్ చేసింది అయితే ఇప్పటి వరకు ఈ రేంజ్ లో ఏ సినిమా కూడా వసూళ్లు సాధించలేదు. అయితే గతంలో కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన కరీబ్ సింగ్ సినిమాలనే 375 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఆ రికార్డును యానిమల్ బ్రేక్ చేయగా.. తన రికార్డును తానో బద్ధలు కొట్టుకున్న మొట్ట మొదటి వ్యక్తిగా సందీప్ రెడ్డి వగ్గా ట్రెండ్ సెట్ చేశారు.

Sandeep Reddy Vanga Breaks His Own Record With Animal Movie

ఇదొక్కటే కాకుండా తెలుగుతో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ డబ్బింగ్ చిత్రంగా కూడా యానిమల్ రికార్డుకు ఎక్కబోతుంది. మరి ఈ స్థాయిలో దూసుకెళ్తున్న ఈ సినిమా ఈ నెలంతా ఇదే ఊపులో సాగనుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకొని... లాభాల్లో కొనసాగుతోంది. చూడాలి మరి పూర్తి అయ్యేసరికి ఎంత మేర వసూళ్లు చేస్తుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X