ప్రధాని మోదీని ఉద్దేశించి సందీప్ రెడ్డి వంగ ట్వీట్.. అనవసరంగా కెలుక్కున్నాడా?

ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించి తీసింది ఒకే ఒక సినిమా. ఆ సినిమాతోనే జాతీయ స్థాయి దర్శకుడిగా మారాడు. 300 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రానికి దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ పేరు తెచ్చుకొన్నాడు. అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో మాదిరిగానే సందీప్ రెడ్డి కూడా మాటల్లో చేతల్లో రెబల్‌గా కనిపిస్తారు. తాజాగా సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకు సందీప్ రెడ్డి చేసిన ట్వీట్ ఏమిటంటే..

Recommended Video

Sandeep Reddy Vanga Comments On CAA NRC & Narendra Modi
దేశవ్యాప్తంగా ఆందోళనలు

దేశవ్యాప్తంగా ఆందోళనలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్సార్సీ అంశాలపై ప్రతికూలంగా ర్యాలీలు, వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలతో పలు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ రంగానికి చెందిన ప్రముఖులు కొందరు సానుకూలంగా.. మరికొందరు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

ప్రధానిపై నమ్మకం ఉందంటూ..

ప్రధానిపై నమ్మకం ఉందంటూ..

దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో CAA, NRCలపై సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ.. #iTRUSTMYPRIMEMINISTER అనే హ్యాష్ ట్యాగ్ అన్ని ప్రశ్నలకు నా సమాధానం అని చెబుతున్నాను అని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది.

చట్టాలను బలవంతంగా రుద్దుతున్నారనే..

చట్టాలను బలవంతంగా రుద్దుతున్నారనే..

దేశంలోని ముస్లిం సోదరులపై బలవంతంగా ఈ చట్టాలను బలవంతంగా రుద్దుతున్నారనే భయాందోళనలకు #iTRUSTMYPRIMEMINISTER కరెక్ట్ అన్సర్ ఇది. భారత్ అన్ని మతాలకు సమానత్వంతో, సురక్షితమైన ప్రదేశమని నమ్ముతున్నాను అని సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేశారు. దాంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 4 వేల మంది రీ ట్వీట్ చేయగా, 15 వేల మందికిపైగా లైక్ చేయడం గమనార్హం. అయితే అనవసరంగా రాజకీయాల్లో తలదూర్చి కెలుక్కున్నాడా అనే మాట వినిపిస్తున్నది.

బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌తో

బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌తో

అర్జున్ రెడ్డి సినిమాతో 2017లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగ.. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేస్తూ కబీర్ సింగ్‌‌తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం డెవిల్ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మహానటి చిత్రంలో ప్రముఖ దర్శకుడు వేదాంత రాఘవయ్యగా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X