బోల్డ్ స్క్రిప్టు కాదట.. అర్జున్ రెడ్డి దర్శకుడి చేయబోయే సినిమా ఇదే..

టాలీవుడ్ లో ఇప్పుడు సందీప్ రెడ్డి హాట్ కేక్. సారీ.. ఆయన్ను సందీప్ రెడ్డి అనడం కంటే.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ అంటే బెటరేమో. ఎందుకంటే.. ఎవరూ ఊహించలేని సబ్జెక్ట్ తో తెలుగు సినిమా తెరను రాక్ చేస్తూ..

By Rajababu

టాలీవుడ్ లో ఇప్పుడు సందీప్ రెడ్డి హాట్ కేక్. సారీ.. ఆయన్ను సందీప్ రెడ్డి అనడం కంటే.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ అంటే బెటరేమో. ఎందుకంటే.. ఎవరూ ఊహించలేని సబ్జెక్ట్ తో తెలుగు సినిమా తెరను రాక్ చేస్తూ.. షేక్ చేస్తున్న సందీప్ రెడ్డి.. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు హాట్ ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత.. ఆయన చేయబోయే సినిమా ఏంటా అన్నదే.. ఇప్పుడు ఎవరికీ అంతుబట్టకుండా మారింది. దానికి తగ్గట్టే.. సందీప్ రెడ్డి సైలెన్స్ మెయింటైన్ చేస్తుండడంతో.. సస్పెన్స్ పెరుగుతూ పోతోంది.

సందీప్ రెడ్డి డ్రీమ్ సబ్జెక్ట్

సందీప్ రెడ్డి డ్రీమ్ సబ్జెక్ట్

ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సందీప్ రెడ్డికి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది కమర్షియల్ ఫార్మాట్ లవ్ స్టోరీ కాదు. పక్కా క్రైమ్ థ్రిల్లర్. పేరు.. షుగర్ ఫ్యాక్టరీ. టైటిల్ వింటుంటేనే.. ఏదో విషయం ఉంది అనిపిస్తోంది కదా. కానీ.. ఈ సినిమా గురించి.. సందీప్ రెడ్డి కాళ్లరిగేలా తిరిగాడంట. ఏ డైరెక్టర్ కు చెప్పినా.. అంత ఇంటెలిజెన్స్ అవసరమా అని మాటలతో బాదేస్తూ.. మాంఛి కమర్షియల్ సబ్జెక్ట్ తో రావాలని సూచించారట.

Recommended Video

Arjun Reddy collections Surprises everyone!, Check Out Here ...
అర్జున్ రెడ్డికీ తప్పని తిప్పలు

అర్జున్ రెడ్డికీ తప్పని తిప్పలు

అందరిలా ఎందుకు.. కాస్త కొత్తగా చేద్దామన్న తపనే.. సందీప్ రెడ్డికి కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బందులు కలగజేసింది. ఇష్టపడి.. కష్టపడి రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్ షుగర్ ఫ్యాక్టరీని ఎవరూ ఇష్టపడకపోవడంతో.. అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి. అక్కడా సేమ్ సీన్. మరీ ఇంత బోల్డ్ స్క్రిప్టా.. అంటూ చాలా మంది అడ్డం పడ్డారట. సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదట. ఆ హీరో అని ఈ హీరో అని తిరిగీ తిరిగీ.. ఆఖరికి విజయ్ దేవరకొండతో సినిమా చేసి.. సూపర్ హిట్ కొట్టాడు.. సందీప్.

 సీన్ మారింది.. డిమాండ్ పెరిగింది

సీన్ మారింది.. డిమాండ్ పెరిగింది

అర్జున్ రెడ్డి రిలీజ్ కు ముందు.. టాలీవుడ్ లో సందీప్ రెడ్డి ఓ అనామకుడు. చాలామంది దర్శకుల్లాగే.. అతను కూడా.. నిర్మాతలు, హీరోల చుట్టూ తిరిగినవాడే. కానీ.. కాలం మారింది. అర్జున్ రెడ్డి హిట్.. సందీప్ రెడ్డి దశను మార్చేసింది. హిట్ డైరెక్టర్లు, డిమాండ్ ఉన్న డైరెక్టర్ల జాబితాలో సందీప్ ను చేర్చేసింది. దీంతో.. సందీప్ తన డ్రీమ్ సబ్జెక్ట్ తో తీసినా.. మరే కథతో సినిమా తీసినా.. నిర్మించేందుకు చాలా మంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారట. తమ పలుకుబడితో సందీప్ ను ఒప్పించి.. అర్జున్ రెడ్డిని మించిన సినిమా తీయించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారట.

 తనే నిర్మాతగా…

తనే నిర్మాతగా…

తన కష్టపడి ఇష్టపడి రాసుకున్న సబ్జెక్ట్ షుగర్ ఫ్యాక్టరీ. ఆ సబ్జెక్ట్ ను తానే నిర్మాతగా తీస్తానని సందీప్ రెడ్డి తన సన్నిహితులతో చెప్పేస్తున్నాడట. ఆ సబ్జెక్ట్ ను నిర్మించే అవకాశం ఎవరికీ ఇచ్చేది కూడా లేదు అని తేల్చేస్తుండడంతో.. సందీప్ తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అన్న చర్చ జోరుగా జరుగుతోంది. తనే నిర్మాతగా షుగర్ ఫ్యాక్టరీ సినిమా చేస్తాడా? లేదంటే.. వేరే నిర్మాతకు సినిమా చేసి పెడతాడా? ఈ ప్రశ్నలకు.. సందీపే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X