మహేష్‌బాబుతో సినిమాపై సందీప్ రెడ్డి క్లారిటీ
అర్జున్‌రెడ్డి చిత్రంతో ఓవర్‌నైట్‌లో సందీప్‌రెడ్డి వంగా పాపులర్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఒకే చిత్రంతో మంచి ప్రజాదరణను ఆయన మూటగట్టుకొన్నారు. అయితే అర్జున్‌రెడ్డి తర్వాత తెలుగులో మరో చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. కానీ మహేష్‌బాబుతో సినిమాపై ప్రస్తుతం పనిచేస్తున్నట్టు సమాచారం. ఇటీవల మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. సందీప్‌రెడ్డితో సినిమా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. మహేష్‌బాబుతో సినిమా చేయనున్నాను. ఇటీవలే మహేష్‌ను కలిసి కథను వినిపించడం జరిగింది. మా ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ కూడా జరిగింది అని సందీప్‌రెడ్డి వంగా తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అర్జున్‌రెడ్డి రీమేక్‌ను తెరకెక్కించే ప్రయత్నం చేయనున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్‌లో షాహీద్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

sandeep reddy vanga mahesh babu arjun reddy shahid kapoor సందీప్‌రెడ్డి వంగా మహేష్‌బాబు అర్జున్‌రెడ్డి షాహీద్ కపూర్


Click it and Unblock the Notifications