అర్జున్ రెడ్డి దర్శకుడి మరో సంచలనం..మెకానిక్ గా మహేష్ బాబు..బాక్స్ ఆఫీస్ కి రిపేర్లు ఖాయం!
సూపర్ స్టార్ మహేష్ బాబు కారు మెకానిక్ కాబోతున్నాడు. రిచ్ లుక్ లో అదరగొట్టే ఈ బిజినెస్ మాన్ తొలిసారి బోల్ట్ మరియు స్పానర్ చేతబట్టబోతున్నాడట. టాలీవుడ్ లో ఇప్పుడే మొదలైన ఈ వార్త సంచలనంగా మారింది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓ ఊపు ఊపి అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్ వంగకు మహేష్ ఓకె చెప్పాడట. సందీప్ వంగ చెప్పిన మెకానిక్ కథ మహేష్ కు నచ్చడంతో వెంటనే అంగీకారం తెపిఆడనేది లేటెస్ట్ న్యూస్.
Recommended Video


మెకానిక్ గా శ్రీమంతుడు
అర్జున్ రెడ్డి దర్శకుడు మహేష్ బాబుమెకానిక్ పాత్రలో ఊహించుకుని ఓ కథ రాసుకున్నాడట. ఆ కథకి మహేష్ బాబు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే శ్రీమంతుడు మెకానిక్ కాబోతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉంది.

మెకానిక్ చుట్టూ కథంతా
కారు మెకానిక్ గా మహేష్ బాబు కనిపిస్తాడట. ఈ పాత్ర చుట్టూ కథ మొత్తం తిరుగుతుందని చెబుతున్నారు.

వచ్చే ఏడాది ప్రారంభం
ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కథకి పూర్తి మెరుగులు దిద్దిన తరువాత రంగంలోకి దిగుతారట.

కమిటైన చిత్రాలు పూర్తి కావాలి
మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. వంశి పైడి పల్లి చిత్రంతో మహేష్ కు ఈ ఎడ్డీ సరిపోతుంది. కనుక సందీప్ చిత్రం ప్రారంభం అయ్యేది 2019 లోనే.

మహేష్ ని ఆకట్టుకున్న అర్జున్ రెడ్డి
సందీప్ వంగ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రం మహేష్ బాబుని ఎంతగానో ఆకట్టుకుంది. స్వయంగా ట్విట్టర్ లో స్పదించిన మహేష్ అర్జున్ రెడ్డి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











