Allu Arjun Arrest: అసలు తప్పు ఎవరిది? కేసును తప్పుదారి పట్టిస్తున్నారా? సంచలనం సృష్టిస్తున్న లెటర్!
Allu Arjun Arrest: సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరు ఊహించని విధంగా ప్రముఖ సినీనటుడు, ఐకాన్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పుష్పా -2 సినిమా ప్రిమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ కు హీరో అల్లు అర్జున్ రావడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు రాసిన ఓ లేఖ సంచలనంగా మారింది. ఇంతకీ ఆ లెటర్ లో ఏముంది?
ఫ్యాన్ ఇండియా మూవీ పుష్ప 2 చూసేందుకు హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్లారు. ఈ సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. టీ తొక్కి సలాటలో ఓ మహిళ మృతి చెందగా అతని కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనపై బాధితురాలు భర్త ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 105 118(1), r/w 3(5), BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో సంధ్యా థియేటర్ యజమానితోపాటు మేనేజర్ ను కూడా అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని వారిని బాధ్యులుగా చేర్చారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ని శుక్రవారం నాడు తన నివాసంలో అరెస్టు చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ రిమాండ్ రిపోర్టును స్టేట్మెంట్ను తీసుకొని, అనంతరం అల్లు అర్జున్ ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు.
ఈ తరుణంలో సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు రాసిన ఓ లేఖ సంచలనంగా మారింది. పుష్ప 2 సినిమా ప్రీమియం షో సందర్భంగా తమ థియేటర్ కు సినిమా హీరో, హీరోయిన్లతో పాటు డైరెక్టర్ ఇతర నటులు విచ్చేస్తారని, తమ థియేటర్ కు బందోబస్తు కల్పించాలని రిక్వెస్ట్ చేస్తూ ఓ లెటర్ రాశారు. అందులో డిసెంబర్ 4, 5 తేదీలలో థియేటర్ వద్ద బందోబస్తు ఏర్పాట్లు చెయ్యాలంటూ విన్నపం చేశారు. ఈ లెటర్ ను సంధ్య ధియేటర్ యాజమాన్యం 2 తేది నాడే రాసినట్టు ఉంది. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ కావడంతో ఈ కేసులో అసలు నిందితులు ఎవరు? ఈ ఘటనకు బాధ్యులెవరు? అనేది సర్వత్రా చర్చనీయంగా మారింది.

సంధ్యా థియేటర్ యజమాన్యం ముందుగానే పోలీసులకు సమాచారం అందించి ఉంటే.. పోలీసులు ఎందుకు సరైన భద్రత ఏర్పాట్లు చేయలేకపోయిందనేది ప్రశ్నార్ధకంగా మారింది.ప్రస్తుతం ఈ లెటర్ ను బేస్ చేసుకుని అల్లు అర్జున్ అరెస్టును తన తరపు న్యాయవాదులు చాలెంజ్ చేసే అవకాశం ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ లెటర్ బేస్ చేసుకొని కోర్టు.. రిమాండ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, మరి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











