‘సంద్రం’ మూవీకి క్లీన్ ‘యు’
మిత్రవింద్ర సమర్పణలో శ్రీ సాయిమిత్ర ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్ తెన్నేటి నిర్మిస్తున్న 'సంద్రం' సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేశారు సెన్సార్ బోర్డు వారు. అర్జున్-దీపిక జంటగా నటించిన చిత్రానికి కుమార్ రాజు ముదునూరి దర్శకుడు. సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైన సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ...జాలర్ల జీవితాలలో బంధాలు-అనుబంధాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. సెన్సార్ పూర్తయి, క్లీన్ యు అందుకున్నాం. ప్రస్తుత తరుణంలో విలువలతో కూడిన చిత్రమిదని సెన్సార్ బృందం మెచ్చుకుందని తెలిపారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.
బాబి, శ్రీకాంత్, సురేష్, సైదులు, చంద్రశేఖర్‌రావు, పద్మప్రియ, జయలక్ష్మి, దండు రాధ, గౌరిశంకర్, అజయ్ తదితరులు నటించారు. కెమెరా: బి.దుర్గాకిషోర్, సంగీతం: క్రిష్, పాటలు: నాగు గవర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: నారాయణ శౌరి, రచన-దర్శకత్వం: కుమార్‌రాజు.
మత్య్సకారుల జీవన విధానాన్ని ఆధారంగా చేసుకుని గత కొన్ని రోజల క్రితం వచ్చిన ఓ సినిమా మంచి విజయం సాధించడంతో అవార్డులు కూడా సొంతం చేసుకోవడం.....ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్టవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications