twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #BanVamsiShekarPRO వివాదం మధ్య నాట్యం చిత్రానికి అరుదైన గౌరవం.. సంధ్యారాజు, రేవంత్ ఏమన్నారంటే

    |

    సంప్రదాయ నృత్యం ప్రధాన నేపథ్యంగా తెరకెక్కిన నాట్యం చిత్రం ఈ మధ్య చోటుచేసుకొన్న వివాదంలో నలిగిపోయింది. తమ చిత్రంపై కక్ష కట్టారంటూ న్యాట్యం సినిమాకు పీఆర్వోలుగా వ్యవహరించిన వంశీ శేఖర్‌పై దర్శకుడు రేవంత్ కోరుకొండ తీవ్ర ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే మా అధ్యక్షుడు విష్ణు మంచు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్, సినీ నిర్మాతల మండలి ప్రతినిధులు ప్రసన్న కుమార్‌కు దర్శకుడు రేవంత్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి వివాదాల మధ్య నాట్యం చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. దాంతో ఈ సినిమాలో ప్రధాన భూమికను పోషించడంతో నిర్మాతగా వ్యవహరించిన సంధ్యా రాజు, దర్శకుడు రేవంత్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ ఆనందాన్ని మీడియాతో పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ప్ర‌ముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ నిశ్రింక‌ళ ఫిల్మ్ ప‌తాకంపై నిర్మించిన చిత్రం నాట్యం. రేవంత్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అక్టోబ‌ర్ 22న విడుద‌లైన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. ఈ నెల 20న గోవాలో ప్రారంభం అవుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఈ చిత్రం ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం పాత్రికేయుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది.

    Sandya Rajus natyam movie elected for Indian Panorama of IFFI

    #BanVamsiShekarPRO: ముదిరిన నాట్యం వివాదం.. లక్షలు దండుకొని కక్ష కట్టారు.. పీఆర్వో వంశీ,శేఖర్‌పై రేవంత్#BanVamsiShekarPRO: ముదిరిన నాట్యం వివాదం.. లక్షలు దండుకొని కక్ష కట్టారు.. పీఆర్వో వంశీ,శేఖర్‌పై రేవంత్

    ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రేవంత్ కోరుకొండ మాట్లాడుతూ గోవాలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) ఎంపికైన ఏకైక తెలుగు సినిమాగా నాట్యం నిలవడం గర్వంగా ఉంది. భారతీయ, తెలుగు సంస్కృతి గొప్పతనం, అందం గురించి అందరూ మాట్లాడుకోవాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. కొత్తదనాన్ని ప్రేక్షకులకు పంచాలని భావించాం. ఆ ఘనతను సాధించామనిపిస్తుంది. ఇండియన్ పనోరమకు వివిధ భాషల నుంచి ఇరవై ఐదు సినిమాలు ఎంపికకాగా వాటిలో నాట్యం ఒకటిగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నా. అందరూ గర్వపడే తెలుగు సినిమా ఇది. సంధ్యారాజుతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ సమిష్టిగా కష్టపడి ఈ సినిమా చేశాం. ఏడాదిన్నర శ్రమకు ప్రతిఫలం దక్కంది. బాలకృష్ణ, చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ కె విశ్వనాథ్‌తో పాటు ఇండస్ట్రీలోని చాలా మంది సినీ ప్రముఖులు సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి సహాయపడ్డారు. త్వరలో ఈ సినిమాను ఓటీటీలో విడుదలచేయబోతున్నాం అని తెలిపారు.

    వంశీ శేఖర్ చీటింగ్ చేశారు.. నాట్యం సినిమాపై విషం చిమ్మించారు.. డైరెక్టర్ రేవంత్ తీవ్ర ఆరోపణలువంశీ శేఖర్ చీటింగ్ చేశారు.. నాట్యం సినిమాపై విషం చిమ్మించారు.. డైరెక్టర్ రేవంత్ తీవ్ర ఆరోపణలు

    కమల్ కామరాజు మాట్లాడుతూ చక్కటి కళాత్మక చిత్రంగా నాట్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. ఓ సినిమా షూటింగ్ కోసం జబల్పూర్ వెళ్లాను. అక్కడ కూడా ఈ సినిమా బాగుందని చాలా మంది చెప్పడం సంతోషాన్ని కలిగించింది. నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా ఇది. తెలుగు సంస్కృతులు సంప్రదాయాల విశిష్టతను చాటిచెబుతూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, భారీ బడ్జెట్‌తో సంధ్యారాజు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మంచి సినిమాలో నేను భాగం కావడం గర్వంగా అనిపిస్తుంది అని తెలిపారు.

    Sandya Rajus natyam movie elected for Indian Panorama of IFFI

    సంధ్యారాజు మాట్లాడుతూ కుటుంబ వ్యాపారాలు, డ్యాన్స్‌ను వదిలిపెట్టి సినిమా చేయడం అవసరమా అని చాలా మంది విమర్శించారు. నేను ఎన్ని సమాధానాలు చెప్పిన వారు సంతృప్తిగా ఫీలవ్వలేదు. అలాంటివారందరికి ఇఫికి ఈ సినిమా ఎంపికకావడమే పెద్ద సమాధానంగా భావిస్తున్నా. తెలుగు నాట్యకళలకు మరింతగా ఈ సినిమా గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నా అని చెప్పింది.

    విరోధి, గతం తర్వాత ఇండియన్ పనోరమకు ఎంపికైన తెలుగు సినిమాగా నాట్యం నిలిచిందని, మంచి సినిమాలు తెలుగులో వస్తాయని నిరూపించింద‌ని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల పాల్గొన్నారు.

    English summary
    Sandya Raju's natyam movie elected for Indian Panorama of IFFI 2021. This is occassion, Actor, Dancer, Producer Sandhya Raju and Director Revanth Korukonda expressed happiness and shared the their lighter moments with media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X