'సంగమం' నాట్ బ్యాడ్...

ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లో ఎక్కువ భాగం అమెరికా లో జరుగుతుంది. సంస్కృతి (సింధూర గద్దె) మణుగూరు రాఘవరావు కుమార్తె. ఆయనకు అమెరికా అంటే ఎవర్షన్. కానీ సంస్కృతి అనుకోని పరిస్ధితుల్లో అమెరికా వెళ్ళుతుంది. అక్కడున్నఅగ్రికల్చర్ సైంటిస్టు (ఎన్.ఆర్.ఐ) అబ్రహం(రోహిత్ ఖురానా) ఆమెతో ప్రేమలో పడి ఎక్స్ ప్రెస్ చేస్తాడు. అప్పుడామె ఏం నిర్ణయం తీసుకుంది. ఎలా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అనేదే మిగతా కథ.
సల్మాన్ ఖాన్ ని తలపించే రోహిత్ ఖురానా నటనా పరంగా కొత్త వాడైనా నాచురల్ గా చేసాడనే చెప్పాలి. గద్దె సింధూర అయితే కేవలం పాసయింది అని చెప్పుకోవాలి. సుహాసని,మురళీమోహన్ వంటి సీనియర్లు గురించి చెప్పేదేముంది. ఇక సినిమాలో సీన్లు స్లో గా ఉన్నా ఫీల్ పండించటానికే అట్లా చేసారని అనిపిస్తుంది. కీరవాణి సంగీతంలో 'చినుకు ...చినుకు' పాట చాలా బాగుంది. రసూల్ స్వతహాగా కెమెరామెన్ కాబట్టి ఆ డిపార్టుమెంట్ డబుల్ ఓ.కె. డైలాగులు ఇంకా బాగుండాలి. అలాగే కథ కాస్త ఉంటే మరింత బాగుండేది. అలాగే 'ప్రయత్నాలు విఫలం కావచ్చు కానీ ప్రయత్నించటం విఫలం కాకూడదు' సింధూర చెప్పే డైలాగు బాగుంది. 'పెళ్ళి పుస్తకం' టైటిల్ సాంగ్ మన సంప్రదాయాలను ఒక అమెరికన్ అమ్మాయికి పరిచయం చేసేటప్పుడు తీసుకోవటం బాగుంది. యేదైమైనా మన సంస్కృతి సంప్రదాయాలకు విలువ నిస్తూ వచ్చిన ఈ చిత్రం ఒక్కసారి చూడచ్చు.


Click it and Unblock the Notifications











