నాగచైతన్యతో ఘర్షణ పెట్టుకున్న అల్లరి నరేష్
అల్లరి నరేష్,నాగచైతన్య భాక్సీఫీస్ వద్ద పోటీ పడనున్నారు.నాగచైతన్య తాజా చిత్రం బెజవాడ విడుదల తేదీని డిసెంబర్ 1 తేదీని మార్చటంతో ఈ పోటీ ఏర్పడింది.అదే రోజున అల్లరి నరేష్ తాజా చిత్రం సంఘర్షణ చిత్రం విడుదల అవుతోంది.నాగచైతన్య తన బెజవాడ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.దడ ప్లాప్ కావటంతో ఈ యాక్షన్ చిత్రం తనను లవ్ స్టోరీనుంచి తప్పించి యాక్షన్ బాటలోకి తీసుకెళ్తుందని భావిస్తున్నాడు.ఇక అల్లరి నరేష్ చిత్రం సంఘర్షణ విషయానికి వస్తే..తమిళంలో 'పొరాళి"టైటిల్ తో ఈ చిత్రం విడుదల చేస్తున్నారు.దీన్ని టింబు ప్రొడక్షన్స్ సంస్థ 'సంఘర్షణ' పేరుతో తెలుగులోకి అనువదిస్తోంది.కథ విషయానికి వస్తే..నిత్యజీవితంలో మనం ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొంటాం. అలా నలుగురు వ్యక్తులు ఎదుర్కొనే సంఘర్షణే ఈ చిత్రం.
కథకు తగిన పేరు కుదిరింది. అతి సామాన్యమైన జీవితం కోసం ఓ నలుగురు ఎలాంటి పాట్లు పడ్డారనే విషయాన్ని దర్శకుడు అత్యంత ఆసక్తికరంగా చెప్పారు. ఇది సీరియస్ సినిమా కాదు. వినోదం కూడా ఉంటుంది.ఈ చిత్రాన్ని 'శంభో శివ శంభో" వంటి పలు హిట్ చిత్రాల్ని తమిళంలో రూపొందించిన సముద్రఖని డైరక్ట్ చేసారు.బెజవాడ చిత్రం విషయానకి వస్తే రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్నారు.వివేక్ కృష్ణ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











