తమిళనాట...భారీ అందగత్తెల లిస్టులలో ఒకరిగా చేరి అజిత్ వంటి హీరోల సరసన చేసి...ప్రస్తుతం ఫేడవుట్ అయిన తార సంఘవి. ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ ని సుల్లాన్ సినిమాలో ఐటం సాంగ్ ద్వారా ప్రారంభించింది గానీ...వర్కవుట్ కాలేదు. ఎక్కడా ఆఫర్స్ లేకపోవటంతో సహనం తగ్గిన ఆమె అందరి హీరోయిన్స్ లాగానే చిన్న తెరపై వెలగాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఆమె త్వరలో బుల్లితెర మెగా డైరక్టర్ సి.జె.భాస్కర్ 'గోకులత్తై' సీత అనే సీరియల్ లో నటించటానికి ముందుకొచ్చింది. త్వరలోనే ఈ సీరియల్ తమిళ ప్రేక్షకులను అలరించనుంది. అయితే ఈ విషయాన్ని సీరియల్ స్టార్ట్ అయ్యే దాకా రహస్యంగా ఉంచాలనే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈలోగా ఎవరన్నా తమ సినిమాలో ఆఫర్ ఇవ్వచ్చుకదా అనేది ఆమె ఆశ.
Story first published: Friday, June 26, 2026, 14:53 [IST]