బూతు సీన్లు: నో చెప్పిన హైదరాబాదీ క్రికెటర్ మాజీ భార్య!
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాదీ క్రికెటర్ అజారుద్దీన్ నటి, మోడల్ సంగీత బిజిలానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే వీరు విడిపోయారు. భర్తతో విడిపోయిన తర్వాత సంగీతా బిజిలానీ మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది. ఇటీవలే ఆమెకు బాలీవుడ్లో 'షాబ్' అనే చిత్రంలో అవకాశం వచ్చింది.
కథ, స్ర్రిప్టు డిమాండ్ మేరకు ఆమె ఈ చిత్రంలో లిప్ లాక్ సీన్లు, హాట్ హాట్ పడకగది సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. ఈచిత్రంలో ఆమెది ఓ హై సొసైటీ లేడీ పాత్ర. అయితే తెరపై లిప్ లాక్ సీన్లు, హాట్ అండ్ సెక్సీ రొమాంటిక్ సీన్లు చేయడానికి సంగీతా బిజిలానీ మనసు ఒప్పలేదు.

దీంతో ఈ విషయాన్ని దర్శకుడు ఓనిర్ దృష్టికి తీసుకెళ్లింది. అలాంటి సీన్లు లేకుండా చూడాలని కోరింది. అయితే స్క్రిప్టు ప్రకారం అలాంటి సీన్లు తప్పని సరికావడంతో.......దర్శకుడు ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు. దీంతో తాను ఈ సినిమా చేయలేను అని తెగేసి చెప్పి ఆ ప్రాజెక్టు నుండి తప్పకున్నట్లు సమాచారం.
అజారుద్దీన్, సంగీత బిజిలానీ 1996లో వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో కలిసి ఉండటం ఇష్టం లేక విడిపోయారు. 2010లో ఇద్దరూ ఒకరికిఒకరు దూరం అయ్యారు.


Click it and Unblock the Notifications











