MAD Twitter Review: మ్యాడ్‌కు ఊహించని టాక్.. ఆ సినిమాలతో పోలుస్తూ.. ఎన్టీఆర్ బామ్మర్ధి ఎలా చేశాడంటే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో యూత్‌ఫుల్ కామెడీ కంటెంట్‌తో సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయి. దీంతో అలా వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందిస్తున్నారు. దీంతో కొందరు ఆ తరహా ప్రయోగాలతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అలా రూపొందిన సినిమానే 'మ్యాడ్'. ముగ్గురు కుర్రాళ్ల కథతో కాలేజ్ డేస్ కాన్సెప్టుతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? ఇందులో ఎన్టీఆర్ బామ్మర్ది ఎలా చేశాడు? చూద్దాం పదండి!
మ్యాడ్ అంటూ వచ్చిన కుర్రాళ్లు
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమానే 'మ్యాడ్'. ఈ మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో హారిక, సాయి సౌజన్య నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు.

అలాంటి కథ.. ఫుల్ ఫన్ కాన్సెప్ట్
హ్యాపీ డేస్ తరహా స్టోరీతో జాతి రత్నాలు రేంజ్ కామెడీతో రూపొందిన సినిమానే 'మ్యాడ్'. కాలేజ్ లైఫ్‌లో ముగ్గురు కుర్రాళ్లు చేసిన అల్లరి నేపథ్యంతో ఈ చిత్రం రూపొందింది. దీని నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేశారు.
నవ్వుతూనే ఉంటారు అంటూ
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మ్యాడ్' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ ఇలా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకూ కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి ఎంటర్‌టైన్ అయ్యే మూవీ. మీ గ్యాంగ్‌తో కలిసి ఈ మూవీని చూడండి. నేను మరోసారి ఈ సినిమాకు వెళ్తాను' అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చారు.
టూ గుడ్ ఫిల్మ్ మ్యాడ్ అని
ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మ్యాడ్' మూవీని చూసి మరో నెటిజన్ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ మేరకు తన ట్వీట్‌లో 'మ్యాడ్ టూ గుడ్ మూవీ. మొదటి నుంచి చివరకూ వరకూ ఎంతో వినోదంతో సాగిపోయింది. DD (సంగీత్) క్యారెక్టర్ అయితే సినిమాకు ప్రాణం అని చెప్పాలి. భీమ్స్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది' అంటూ వెల్లడించారు.
ఏం మూవీరా బాబు అంటూ
యువతకు కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిన 'మ్యాడ్' మూవీని చూసిన ఇంకో నెటిజన్ ఇలా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'ఏం మూవీరా బాబు. నెక్ట్స్ లెవెల్ ఎంటర్‌టైనర్. కామెడీ అదుర్స్. ఈ వీకెండ్‌కు మీ ఫ్రెండ్స్‌తో కలిసి చూడదగ్గ సినిమా. పెద్ద హిట్ కాబోతున్న సందర్భంగా మ్యాడ్ మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్' అంటూ రాసుకొచ్చారు.
సంగీత్ గురించి స్పెషల్‌గానే
ముగ్గురు కుర్రాళ్లు కలిసి నటించిన 'మ్యాడ్' మూవీపై తాజాగా మరో నెటిజన్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. అందులో ఆయన 'మ్యాడ్ సినిమాలో సంగీత్ శోభన్, విష్ణు అదిరిపోయే యాక్టింగ్ చేశారు. వీళ్లిద్దరూ బాగా హైలైట్ అయ్యారు. సినిమాలో వచ్చే లేడీస్ హాస్టల్ సీన్స్ అన్నీ కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి' అంటూ పేర్కొన్నారు.
నితిన్‌కు మంచి భవిష్యత్ ఉంది
యూత్‌ఫుల్ కాన్సెప్టుతో వచ్చిన 'మ్యాడ్' మూవీని చూసిన మరో నెటిజన్ 'ఏం చెప్పమంటారు మూవీ గురించి? మీకు ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్‌తో వెళ్లి మూవీ చూడండి అంతే. కుమ్మేశారు భయ్యా. అబ్బా యాక్టింగ్ ఒక్కొక్కళ్లు యాక్టింగ్ ఎవరూ తక్కువ కాదు అన్నట్లు చేశారు. నార్నే నితిన్‌కు మంచి భవిష్యత్ ఉంది. అందరికీ కంగ్రాట్స్' అంటూ చెప్పుకొచ్చాడు.
మ్యాడ్ మూవీకి ఓవరాల్ టాక్ ఇలా
సంగీత్, నార్నే నితిన్, రామ్ నితిన్‌లు కలిసి నటించిన 'మ్యాడ్' మూవీకి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ప్రకారం పాజిటివ్ టాక్ వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో వినోదం మొదటి నుంచి చివరి వరకూ ఉందని అంటున్నారు. కొందరు దీన్ని జాతి రత్నాలు, త్రీ ఇడియట్స్ అంటూ ప్రశంసిస్తున్నారు. మొత్తంగా ఈ వీకెండ్‌కు ఫ్రెండ్‌తో కలిసి చూసే సినిమా అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











