తిరుపతిలో సంగీత సీక్రెట్ మ్యారేజ్?

అయితే సంగీత, క్రిష్ తిరుమలలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రావటంతో వాళ్ళు షాకయ్యారట. ఈ విషయాన్ని నిర్థరించుకొనేందుకు వెళ్ళిన మా చెన్నై ప్రతినిధి తో సంగీత మాట్లాడింది. ''నాపై ఇలాంటి పుకార్లు వస్తుంటే ఏం చేయాలో అర్ధం కావటం లేదు. ఈ పెళ్లి వార్త అంతా అబద్ధం. పెద్ద రూమర్. ఇటీవలే నా ప్రెండ్ హీరోయిన్ మహేశ్వరి పెళ్లి కోసం తిరుమల వెళ్లాను. ఇప్పుడు నా పెళ్లి చేసేశారు. అయినా అప్పుడే నా పెళ్లేమిటి? అయినా అంత రహస్యంగా చేసుకోవాల్సిన కర్మ నాకు లేదు.
ఇప్పుడు నా దృష్టి అంతా నటన మీదే . తమిళ చిత్రం 'దనమ్'(కనకం) చక్కగా ఆడుతోంది. మళ్ళీ అవకాశాలూ కంటిన్యూగా వస్తున్నాయి. ఒక వేళ నేను క్రిష్‌ను పెళ్లి చేసుకోవాలంటే మాత్రం అందరికీ చెప్పి చేసుకుంటాను. ఇంట్లో తల్లితండ్రులకు తెలియకుండా చేసుకునే ప్రసక్తే లేద''న్నారు. అంటే ఆమె మనుస్సులో క్రిష్ ఉన్నట్లేనే అనే ఓ కొత్త సందేహం మనలో మొలకెత్తించి మీటింగ్ ముగించింది.


Click it and Unblock the Notifications











