"పెళ్లాం ఊరెళితే" సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ సంగీత ఇప్పుడు ఒకరికి పెళ్లాంగా మారటానికి రెడీగా ఉందిట. హీరోయిన్ గా పేడవుట్ అవుతున్న దిశలో అందరూ తీసుకునే అంతిమ నిర్ణయం ఇదే. కాని ఆమె పరిస్థితి వేరు. శివపుత్రుడు లో చేసిన విలక్షణ పాత్ర ఇంకా అవకాశాలు తెచ్చిపెడుతూనే ఉంది.అందులోనూ ఈ మధ్య తమిళం చేసిన "ఉయుర్" లో మరిదికి లైను వేసే వదిన గారి పాత్ర క్లిక్ అవటం అక్కడ ఓ రకమైన క్రేజ్ ని తెచ్చి పెట్టింది. తెలుగులో కృష్ణా రెడ్డి "బహుమతి" వర్కవుట్ కాకపోయినా నిర్మాతలు అడపా దడపా ఆమెను అడుగుతూనే ఉన్నారు.కాని పాత్రలలో ప్రత్యేకత కావాలని అడుగుతూండటంతో అవి కార్యరూపం దాల్చటం లేదు.ఇవన్నీ ఎలా ఉన్నా నీడలా ఉన్న తల్లికి ఒంట్లో బాగుండకపోవటంతో తోడు కావాలని నిర్ణయానికి వచ్చింది. పెళ్ళి కొడుకు కోసం వేట ప్రారంభమయిందిట.ఎవరో ఆ అదృష్టవంతుడు అని అందరూ ఎదురుచూస్తున్నారు.