For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ నటి సంగీత అరెస్ట్

    By Bojja Kumar
    |
    వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మరో ప్రముఖ నటి సంగీత

    ప్రముఖ తమిళ నటి సంగీత బాలన్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పనయూర్‌ ప్రాంతంలోగల ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ నిర్వహించగా సంగీతతో పాటు పలువురు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్లు సమాచారం.

    పట్టుబడిన మహిళలు, విటులు

    పట్టుబడిన మహిళలు, విటులు

    ఈ దాడిలో పోలీసులు పలువురు మహిళలతో పాటు విటులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన మహిళలు నార్త్ ఇండియాకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని పునరావాస కేంద్రానికి తరలించారు.

    సంగీతకు సహకరిస్తున్న సురేష్ అనే వ్యక్తిని కూడా

    సంగీతకు సహకరిస్తున్న సురేష్ అనే వ్యక్తిని కూడా

    వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సంగీతకు సహకరిస్తున్న సురేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే వీరిని ఎగ్మూరులోని మోట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. చాలా కాలం తర్వాత తమిళనాడులో సెక్స్ రాకెట్లో సినీ నటి పేరు వినిపించడం చర్చనీయాంశం అయింది.

    సంగీత బాలన్

    సంగీత బాలన్

    సంగీత బాలన్ 1996లో వచ్చిన కరప్పురోజా సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించారు. పలు తమిళ చిత్రాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించారు. తమిళ ఛానల్ సన్ టీవీలో ప్రసారం అవతున్న పాపులర్ టీవీ సీరియల్‌ రాణీ-వాణీలో రాధిక శరత్ కుమార్‌తో సంగీత బాలన్ నటించారు.

    టీవీ సీరియల్స్, సినిమాల ద్వారా పాపులర్

    టీవీ సీరియల్స్, సినిమాల ద్వారా పాపులర్

    రాణి-వాణితో పాటు టీవీ కార్యక్రమాలు అవల్, చెల్లమేయ్ అన్నకోడియమ్ అయిందు పెంగులమ్, సబితా ఎల్లీస్ సభాపతి సహా పలు సీరియల్స్‌లో సంగీత బాలన్ నటించారు. కరుప్ప రోజా, తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజాలుమ్ లాంటి చిత్రాల్లో నటించారు.

    English summary
    Popular Tamil actress Sangeetha Balan has been arrested for allegedly running a prostitution ring in Chennai. The actress who is known for her part in Sun TV's Vani Rani was reportedly involved in flesh trade in a private resort at Panayur in Chennai.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more