పోలీసులకు సానియా మీర్జా బాకీ

ఇక ఇదే విషయం పై డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్.బి.నాయక్ మాట్లాడుతూ..ఇప్పుడుకి నాలుగు సార్లు నోటీసులు పంపించాం..రిప్లై ఇవ్వలేదు..డబ్బు పే చెయ్యలేదు అన్నారు. మరొక సీనియర్ అఫిషియల్ స్పందిస్తూ..గత తొమ్మిది నెలలుగా రెండు షిప్టులుగా గన్ మేన్స్ ని ఇచ్చాం. నెలకు ఇరవై ఐదు వేలు చొప్పున సెక్యూరిటీ బిల్ కట్టాల్సి ఉంటుంది అన్నారు. ఇక ఇలా కట్టకుండా సెక్యూరిటీని కంటిన్యూ చేయటం కష్టమని వారు అన్నారు.అలాగే ప్రజారాజ్యం అధినేత చిరంజీవికీ సెక్యూరిటీ ఇస్తున్నామని..అయితే ప్రభుత్వం ఆ బిల్ కడుతోందని అన్నారు. ఇక జీవిత రాజశేఖర్ లకు కూడా ప్రెవేట్ సెక్యూరిటీ ఇస్తున్నామని..వారు ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తున్నారని ప్రశంసించారు.ప్రస్తుతం సిటీ సెక్యూరిటీ వింగ్ దాదాపు నూట యాభై మందికి పైగా ఈ రకంగా పర్శనల్ సెక్యూరిటీ అందిస్తోందని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











