twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీసులకు సానియా మీర్జా బాకీ

    By Staff
    |

    Sania Mirza
    అంతర్జాతీయ స్థాయి టెన్నిస్‌లో రాణించి, హైదరాబాద్‌ కీర్తి పతాకాన్ని రెప రెపలాడించిన సానియా మీర్జా పోలీసులకు రెండు లక్షల రూపాయ లు బాకీ పడింది. బాకీ చెల్లించమని పోలీసులు ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఇక సాక్షాత్తూ ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. సానియాచే ఎలాగైనా ఆ మొత్తాన్ని వసూలు చేస్తామని సాక్షాత్తూ పోలీసు కమిషనర్‌ ప్రసాద్‌ మీడియాతో చెప్పారు.టెన్నీస్ స్టార్ గా ఎదగిన సానియాకు గత రెండు సంవత్సరాల నుంచి సిటీ పోలీసులు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నారు. దీనితో సానియా, సెక్యూరిటీకి రూ. 2 లక్షలు బాకీ పడింది. ఈ మొత్తాన్ని పోలీసులు ఎన్ని సార్లు అడిగినా చెల్లించకపోవడంతో ఈ వివాదం మీడియాకి ఎక్కింది.

    ఇక ఇదే విషయం పై డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్.బి.నాయక్ మాట్లాడుతూ..ఇప్పుడుకి నాలుగు సార్లు నోటీసులు పంపించాం..రిప్లై ఇవ్వలేదు..డబ్బు పే చెయ్యలేదు అన్నారు. మరొక సీనియర్ అఫిషియల్ స్పందిస్తూ..గత తొమ్మిది నెలలుగా రెండు షిప్టులుగా గన్ మేన్స్ ని ఇచ్చాం. నెలకు ఇరవై ఐదు వేలు చొప్పున సెక్యూరిటీ బిల్ కట్టాల్సి ఉంటుంది అన్నారు. ఇక ఇలా కట్టకుండా సెక్యూరిటీని కంటిన్యూ చేయటం కష్టమని వారు అన్నారు.అలాగే ప్రజారాజ్యం అధినేత చిరంజీవికీ సెక్యూరిటీ ఇస్తున్నామని..అయితే ప్రభుత్వం ఆ బిల్ కడుతోందని అన్నారు. ఇక జీవిత రాజశేఖర్ లకు కూడా ప్రెవేట్ సెక్యూరిటీ ఇస్తున్నామని..వారు ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తున్నారని ప్రశంసించారు.ప్రస్తుతం సిటీ సెక్యూరిటీ వింగ్ దాదాపు నూట యాభై మందికి పైగా ఈ రకంగా పర్శనల్ సెక్యూరిటీ అందిస్తోందని చెప్పుకొచ్చారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X