For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సానియా భర్త స్పందన..రామ్ చరణ్ రిలీఫ్???

  By Srikanya
  |

  హైదరాబాద్: భారతీయ టెన్నిస్‌ క్రీడాకారిణి, హైదరాబాద్‌ ఏస్‌ సానియా మీర్జా వెైవాహిక జీవితానికి శుభం కార్డు పడబోతున్నట్టు గత కొద్ది రోజులుగా మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను ప్రేమించి, అమితంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న సానియా ఇప్పుడు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి.

  అంతేకాదు..రామ్ చరణ్ వీరి కాపురంలో చిచ్చు పెట్టారంటూ కూడా ఓ వార్త వచ్చేసింది. అయితే ఈ విషయాన్ని షోయబ్ ఖండించారు. ఆయన ఓ పాకిస్ధాన్ డైలీ తో మాట్లాడుతూ ఇవన్నీ రూమర్స్ అని ఖండించారు. దాంతో రామ్ చరణ్ కు ఏమీ సంభందం లేనట్లే అని ప్రూవ్ అయ్యింది. ఆయన అభిమానులు ఆనందిస్తున్నారు.

  https://www.facebook.com/TeluguFilmibeat

  షోయబ్ మాట్లాడుతూ... "నేనూ సానియా ఇప్పుడు దుబాయిలో ఉన్నాం..కలిసే ఉన్నాం... మేము ఇద్దరం ఎక్కువ సమయం గడపటానికే ఇష్టపడుతున్నాం..అయితే మేము ప్రొఫెషనల్ క్రీడాకారులం కావటంతో అది ఒక్కోసారి కుదరదు. మా కమిట్ మెంట్ లకు మా పర్శనల్ లైఫ్ కు దారి దొరకదు... అలాగని మా వైవాహిక జీవితంలో స్పర్దలు వచ్చాయంటే ఎలా ," అన్నారు.

  మరో ప్రక్క సానియా మీర్జా తన భర్తతో కలిసి తీయించుకున్న క్యూట్ ఫొటోని తన ట్విట్టర్ పేజీలో అప్ లోడ్ చేసి షోయబ్ వ్యాఖ్యలకు బలాన్ని ఇచ్చింది. సానియా ప్రస్తుతం హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో సానియా ఏర్పాటుచేసిన టెన్నిస్‌ అకాడెమీని దుబాయ్‌లో నెలకొల్పాలని తొలుత భావించారు. అయితే, పరిస్థితులు అనుకూలించక ఆ ఆకాడమీని సానియా మీర్జా ఇక్కడే ఏర్పాటు చేసింది. ఇదే వీరి మనస్పర్థలకు తావిచ్చాయిని చెప్పుకున్నారు. పాకిస్థాన్‌ను వీడి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడేందుకు షోయబ్‌ మాలిక్‌ ససేమిరా అన్నట్లు సమాచారం.

  'Sania and I've Strong Relationship'

  అలాగే, హైదరాబాద్‌ను వీడి పాకిస్థాన్‌కు వెళ్లేందుకు సానియా ఇష్టపడటం లేదు. దీంతో వీరిద్దరు గత కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో సానియా మీర్జా, షోయబ్‌ మాలిక్‌లు నెల రోజుల్లో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఫోనులో తలాక్‌.. తలాక్‌.. తలాక్‌ అని చెప్పి విడాకులు పొందే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చేసాయి. అయితే ఇప్పుడు షోయిబ్ వివరణతో కాస్త అవి మరుగున పడే అవాసం ఉంది.

  సానియా సినిమాల విషయానికి వస్తే...

  తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ టెన్నీస్ సంచలనం సానియా మీర్జా వరస విజయాలతో దూసుకుపోతూ తనకో హాలీవుడ్ ఆఫర్ వచ్చిందని రీసెంట్ గా ట్వీట్ చేసి అందరినీ తన వైపుకు తిప్పుకున్న సంగతి తెలిసిందే. డేనియర్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న 24వ బాండ్ సినిమాలో తను ఎంపికయ్యానంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలియచేయటంతో అందరూ ఆశ్చర్యపోయి...శుభాకాంక్షలు తెలిపారు.

  అంతేకాకుండా తాను బాండింగ్ తో ముందుకు వెళ్తున్నానని, ఈ సంతోషాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నట్లు తెలిపింది. అయితే అసలు నిజం వేరు. ఆమె బాండ్ సినిమాలో నటించలేదు. బాండ్ సినిమాల నేపధ్యంలో సోనీ మాక్స్ టీవీ వారు చేస్తున్న స్కూల్ ఆఫ్ బాండింగ్ ...పోగ్రామ్ లో యాంకర్ గా కనిపించనుంది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా విడుదల చేసారు.

  బాండ్ చిత్రం విషయానికి వస్తే...

  ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్ డిసెంబర్ 6న మొదలు పెట్టారు. లండన్ లోని పినెవుడ్ స్టూడిమోస్ సమీపంలో ఈ షూటింగ్ జరుగనుంది. స్కై ఫాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు

  కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటించబోతున్నాడు. గత జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించిన ముఖ్య తారాగణం రాల్ఫ్ ఫిన్నెస్ ‘ఎం' పాత్రలో, నియోమీ హారిస్ ‘ఈవ్ మనీపెన్నీ', బెన్ వైషా ‘క్యూ' పాత్రల్లో నటించబోతున్నారు. ఇతర తారాగణం వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

  స్కైఫాల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన జాన్ లోగన్, నీల్ పర్విస్, రాబర్ట్ వాడ్ పని చేయబోతున్నారు. 2015 ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. బ్రిటన్‌లో అక్టోబర్ 23, 2015న, అమెరికాలో నవంబర్ 6, 2015న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత జేమ్స్ బాండ్ చిత్రం ‘స్కై ఫాల్' ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈసారి వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

  English summary
  "Even now Sania and I are together in Dubai and we love to spend as much time as possible together. But being professional athletes we have to also fulfill our other commitments but it does not mean our marriage is on the rocks," Pakistan cricketer Shoaib Malik was quoted by a Pakistan daily.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X