మ్యాగజైన్‌ల కోసం హాట్ పోజులిచ్చే నువ్వు కూడా నీతులు చెప్పేదానివేనా..? సానియా మీర్జా ఫైర్

Recommended Video

Sania Mirza and Veena Malik's Nasty Twitter Spat After Pak Loss

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని వివాహం చేసుకొని హాయిగా కాపురం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం అయిన కొత్తలో సానియాపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే క్రమంగా అవి తగ్గిపోయినప్పటికీ ఈ ఇద్దరిపై ఎప్పటికీ ఓ కన్నేసి ఉంచుతారు ఇరు దేశాల ప్రజలు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ విషయమై మరోసారి విమర్శల పాలయ్యారు ఈ క్రీడా దంపతులు.

హోరా హోరీ పోరు.. పాక్ చిత్తు చిత్తు

హోరా హోరీ పోరు.. పాక్ చిత్తు చిత్తు

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది పాకిస్తాన్ జట్టు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లపై పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తోంది. పాక్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, మ్యాచ్‌కు ముందు రోజు బయట షికార్లు చేశారంటూ ఆ దేశ అభిమానులు ఫైర్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు.

షోయబ్ మాలిక్, అతని భార్య సానియా మీర్జాపై విమర్శలు

షోయబ్ మాలిక్, అతని భార్య సానియా మీర్జాపై విమర్శలు

పాకిస్థాన్ ఓటమిలో ముఖ్యంగా షోయబ్ మాలిక్ ఎక్కువగా విమర్శల పాలవుతున్నాడు. ఇందుకు ప్రధాన కారణం ఆయన మ్యాచ్ ముందు రోజు తన భార్య సానియా మీర్జాతో కలిసి భోజనం చేసేందుకు బయటకు వెళ్లడమే. కీలక మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ మానేసి ఇలా షికార్లు కొట్టడం సరికాదంటూ షోయబ్, సానియాలపై ఓ రేంజ్ విమర్శలు గుప్పిస్తున్నారు.

హాట్ బ్యూటీ వీణామాలిక్ సైతం

పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత హాట్ బ్యూటీ వీణామాలిక్ సైతం షోయబ్ మాలిక్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్టీస్ మానేసి బయటకు భార్యతో షికార్లు కొట్టాడని విమర్శించింది. మాలిక్ భార్య సానియా క్రీడాకారిణి అయి కూడా ఇలా మ్యాచ్ ముందు రోజు భర్తతో ఎలా జంక్ ఫుడ్ తినిపిస్తుందని, మద్యం కూడా లభించే ఆ ప్లేస్ లోకి తమ కొడుకుతో సహా ఈ దంపతులు ఎలా వెళ్లారని.. సానియా తీరును తప్పుబడుతూ వీణామాలిక్ పోస్ట్ పెట్టింది.

హాట్ పోజులిచ్చే నువ్వు కూడా నీతులు చెప్పేదానివేనా..?

ఇది చూసిన సానియా వీణా మాలిక్ పై ఘాటుగా రియాక్ట్ అయింది. తల్లివి అయ్యాక కూడా పిల్లల గురించి ఆలోచించకుండా మ్యాగజైన్‌ల కోసం హాట్ ఫొటో షూట్స్‌కి సెక్సీ పోజులిచ్చే వీణా నాకు నీతులు చెప్పడం విడ్డూరంగా అనిపిస్తోందని సానియా ట్వీట్ చేసింది. నా బిడ్డపై నీకున్న ప్రేమ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని ఆ ట్వీట్ లో పేర్కొంది సానియా.

మరోవైపు నెటిజన్స్ ఫైర్

మరోవైపు నెటిజన్స్ ఫైర్

ఈమె ఇండియా గెలుపు కోసమే పాక్ వచ్చిందని, పాక్ ఆటగాళ్ల మనోస్థైర్యం దెబ్బ తీసేలా సానియా ప్రవర్తిస్తోందంటూ సానియాపై కొందరు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమె పై పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. దీంతో సానియా ట్విట్టర్‌కు విరామం ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X