twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సానియా మీర్జా ద్వారా ‘DK బోస్’ ఫస్ట్‌లుక్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న 'DK బోస్' చిత్రం ఫస్ట్ లుక్‌ను సామాజిక అనుసంధాన వేదికైన ట్విట్టర్ ద్వారా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆవిష్కరించారు. ప్రస్తుతం అమెరికాలోని మియామిలో ఉన్న సానియా తన ట్విట్టర్లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టు చేయడం ద్వారా దాన్ని రిలీజ్ చేసారు.

    ఈ చిత్రంలో సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. రాండమ్ థాట్స్ బేనర్ పై శేషురెడ్డి, ఆనంద్ రంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఎస్ బోస్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగానే ఇలాంటి వినూత్న రీతిలో ఫస్ట్ లుక్ ఆవిష్కరణ జరిపారు.

    ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టు చేసిన వెంటనే సానియా మీర్జా ఆ చిత్ర నిర్మాత శేషురెడ్డికి చిత్రం మంచి విజయం సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేసారు. మరో వైపు హీరో సిద్ధార్థ కూడా తన ట్విట్టర్ ద్వారా విష్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్టు చేసారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆనంద్ రంగా సిద్ధార్థ స్నేహితుడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ తన ట్విట్టర్లో స్పందిస్తూ... ఆనంద్ రంగ హోమ్ ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న ఈచిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ లక్ అంటూ ట్వీట్ చేసారు.

    డి.కె. బోస్ చిత్ర రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ మసాలా ఎలిమెంట్స్ కలగలిపి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగాగా రూపొందిస్తున్నారు. 'ఈట్స్, డ్రింక్, స్మోక్ మనీ' అనేది ఈచిత్రం ట్యాగ్ లైన్. ఇందులో నిషా అగ్వరాల్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ హెలెట్ అయ్యేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    English summary
    International tennis player Sania Mirza and actor Siddharth have unveiled the first look of much-hyped Telugu movie DK Bose starring Sundeep Kishan and Nisha Aggarwal in leads. Both these celebrities, who are currently in USA, are close friends of producers Seshu Reddy and Anand Ranga, and they unleashed the poster on their respective official Twitter accounts and wished good luck to the film unit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X