ప్రిన్స్ సరసన సానియా మీర్జా
ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి, హైదరబాద్ అమ్మాయి సానియా మీర్జా తెలియని వారుండరు. ఆటతోనే కాకుండా తన గ్లామర్ తో కూడా అభిమానులను సంపాదించుకున్న ఈ ముక్కుపుడక సుందరికి సినీ అవకాశాలు కూడా వచ్చాయి. ఒకప్పుడు రజనీకాంత్ శివాజీలో సానియానే నాయిక అన్న ఫ్రచారం కూడా జరిగింది. కానీ ఈ అమ్మడు మాత్రం టెన్నిస్ కే పరిమితం అయింది. అడపాదడపా వాణిజ్య ప్రకటనల్లో కనిపించే సానియా తాజాగా అమ్మాల గుండెల్లో కలల రాకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబుతో జతకడుతోంది.
ఏ సినిమాలో, దర్శకుడు ఎవరు అని ఊహించేసుకోకండి. ఆమె జతకడుతోంది ఓ వాణిజ్య ప్రకటన కోసం మాత్రమే. ఎయిర్ సెల్ కంపెనీకి తెలుగులో బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయిన ఈ జంట త్వరలోనే ఓ ప్రకటనలో కలిసి నటించనున్నారు. తమిళంలో సూర్య, నేషనల్ లెవల్ లో ధోనీ ఈ కంపెనీకి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మరి వీరి కలయిక ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











